Kanna Lakshminarayana : పార్టీ మారేందుకు తేదీ ఫిక్స్.. ఏ పార్టీలో కంటే..!

ABN , First Publish Date - 2023-02-16T08:12:44+05:30 IST

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు పార్టీ మారనున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఔననే చెబుతున్నాయి. గతంలోనూ కన్నా పార్టీ మార్పుపై ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఆయన పార్టీ మారడం ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తోంది.

Kanna Lakshminarayana : పార్టీ మారేందుకు తేదీ ఫిక్స్.. ఏ పార్టీలో కంటే..!

గుంటూరు : బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) పార్టీ మారనున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఔననే చెబుతున్నాయి. గతంలోనూ కన్నా పార్టీ మార్పుపై ఊహాగానాలు వచ్చాయి. ఒకసారి టీడీపీ (TDP)లోకి వెళ్లనున్నారని.. ఫలానా ప్లేస్ నుంచి పోటీ చేయనున్నారని కూడా టాక్ నడిచింది. ఆ తరువాత జనసేన పార్టీ (Janasena Party)లోకి వెళ్లనున్నారని కూడా వార్తలొచ్చాయి. కానీ అవేమీ జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఆయన పార్టీ మారడం ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.

ఈ రోజు ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీ నారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఆయన నివాసంలోనే జరగనుంది. కన్నా పార్టీ మార్పుపై ఊపందుకుంటున్న ఊహాగానాలకు ఈ సమావేశం మరింత బలం చేకూర్చుతోంది. ఈ నెల 23, 24 తేదీల్లో పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీడీపీలో కానీ జనసేన పార్టీలోకి కానీ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏ పార్టీలో చేరేది ఈ రోజు సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. ఇటీవల కన్నా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సోమవారం అమరావతిలో జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పర్యటనలో సైతం ఆయన పాల్గొనలేదు. కాబట్టి పార్టీ మార్పు ఖాయమనే చర్చ జరుగుతోంది. కన్నా అనుచరులు సైతం ఆయన బీజేపీని వీడటం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి నేడు జరుగుతున్న సమావేశం పూర్తైతే కానీ కన్నా పార్టీ మారతారా? ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటనేది తెలుస్తుంది.

Updated Date - 2023-02-16T10:14:35+05:30 IST