Kanna Lakshminarayana : పార్టీ మారిన తర్వాత టీడీపీ నేతలతో తొలిసారిగా సమావేశం కానున్న కన్నా
ABN , First Publish Date - 2023-03-26T08:49:00+05:30 IST
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన తర్వాత కన్నా తొలిసారిగా టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు.
గుంటూరు : కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన తర్వాత కన్నా తొలిసారిగా టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే నేడు తన నివాసంలో విందు సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీలో చేరిన తర్వాత నేతలతో కలిసి క్షేత్ర స్థాయిలో పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లను కన్నా లక్ష్మీనారాయణ విందుకు ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం కన్నా ఇంటికి టీడీపీ నేతలు భోజనానికి రానున్నారు. ప్రస్తుత రాజకీయలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. సమిష్టిగా పార్టీని ముందుకు తీసుకెళ్ళే అంశంపై నేతలు దృష్టి సారించినున్నారు. జిల్లాలో కన్నా విందు సమావేశం హాట్ టాపిక్‌గా మారింది.