Kotamreddy : ఫైనల్‌గా తన కోరికేంటో చెప్పేశారు.. మరి అధినేత ఏమంటారో?

ABN , First Publish Date - 2023-02-10T12:06:55+05:30 IST

ప్రతిరోజూ వైసీపీ నేతలకు, కోటంరెడ్డికి మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు సర్వ సాధారణమైపోయాయి. కాగా.. నేడు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన కోరికను వెల్లడించారు.

Kotamreddy : ఫైనల్‌గా తన కోరికేంటో చెప్పేశారు.. మరి అధినేత ఏమంటారో?

నెల్లూరు : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)కి.. వైసీపీ నేతలకు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీధర్ రెడ్డి వార్ ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన గన్‌మెన్‌లను ప్రభుత్వం సగానికి తగ్గించింది. ఆ తరువాత తన వద్ద ఉన్న ఇద్దరు గన్‌మెన్‌లను సైతం ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తున్నానని కోటంరెడ్డి వెల్లడించారు. ప్రతిరోజూ వైసీపీ నేతల (YCP Leaders)కు, కోటంరెడ్డికి మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు సర్వ సాధారణమైపోయాయి. కాగా.. నేడు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన కోరికను వెల్లడించారు. టీడీపీ (TDP) నుంచి పోటీ చేయాలన్నదే తన ఆకాంక్ష అని దానికి పార్టీ అధినేత చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు.

వాల్ పోస్టర్లు అంటించి రాజకీయాల్లో ఎదిగాను..

‘‘అధికారానికి దూరంగా ఉన్నా.. నన్ను అభిమానించి సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు నా వెన్నంటి ఉన్నారు. అధికారంలో మీకు అండగా ఉన్నట్టు, భవిష్యత్తులో కూడా మీకు అండగానే ఉంటాను. నా పోరాటాల్లో కూడా అండగా ఉంటామని హామీ ఇస్తానంటున్నందుకు ధన్యవాదాలు. మెజారిటీ కార్పొరేటర్లు, సర్పంచులు నాతో లేరు. ఇప్పుడు నాతో ఉన్న ప్రతి కార్యకర్త, నాయకులని నేను కాపాడుకుంటాను. మాతాత మంత్రి కాదు. జండాలు కట్టాను. వాల్ పోస్టర్లు అంటించి రాజకీయాల్లో ఎదిగాను. కార్యకర్తలని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కార్పొరేషన్లో ఎప్పుడు సమావేశాలు జరిగినా... పిలిచినా, పిలవకపోయిన నేను, మేయర్ వెళ్తాం’’ అని పేర్కొన్నారు.

మీరు చేస్తే పవిత్రం. నేను చేస్తే అపవిత్రమా?

‘‘టీడీపీ గుర్తు మీద గెలిచి వైసీపీలో చేరిన వారి దగ్గర స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలిచి అప్పుడు నా రాజీనామా ప్రస్తావన తీసుకురండి. మీరు చేస్తే పవిత్రం. నేను చేస్తే అపవిత్రమా? నేను లేవనెత్తిన సమస్యలు పరిష్కరించమనే కోరుతున్నా. పరిష్కరిస్తే అభినందిస్తాను. ఒక స్థానిక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు లేవనెత్తవలసిన బాధ్యత నాది. నేను గణేష్ ఘాట్ అభివృద్ధి నాదే అని నేనెప్పుడు చెప్పలేదు. నాటి తెలుగుదేశం మంత్రులు, నాయకులందరిది. ఆదాల నేనే రూరల్ అభ్యర్థిని అని చెబుతూనే ఐదేళ్లకోసారి నిర్ణయం తీసుకుంటాను అని కూడా చెప్పారు. నేను ఎవరి ట్రాప్ లో పడను. ప్రజల ట్రాప్ లో ఉంటాను. ఒక్క ఎమ్మెల్యే కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్రాప్ వేయాల్సిన అవసరం లేదు. టీడీపీ నుంచి పోటీ చేయాలన్నది నా ఆకాంక్ష. నిర్ణయం చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu)ది. జూన్ తరువాత గడపగడపకి కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తాను’’ అని కోటంరెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-02-10T12:10:17+05:30 IST