AP Budget Session: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడంటే...
ABN , First Publish Date - 2023-03-14T14:17:36+05:30 IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది రోజుల పాటు జరుగనున్నాయి.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Budget Session) తొమ్మిది రోజుల పాటు జరుగనున్నాయి. ఈమేరకు బీఏసీ (BAC)లో నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవగా.. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఈనెల 16న సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. ఈనెల 24వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ (CM Jaganmohan Reddy), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana rajendranath reddy), పెద్దిరెడ్డి (Peddireddy Ramachandra reddy), జోగి రమేష్ (Jogi Ramesh), ప్రసాద్ రాజు (Prasad Raju), శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy), టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు (Atchannaidu) హాజరయ్యారు. 20 అంశాలపై చర్చించాలని బీఏసీలో ప్రభుత్వాన్ని అడిగినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు జరిగే షెడ్యూల్.....
15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం
16న సభలో బడ్జెట్ ప్రవేశం
17, 18 తేదీల్లో అసెంబ్లి బిజినెస్
19న ఆదివారంసెలవు
20, 21 తేదీల్లో అసెంబ్లి బిజినెస్
22న ఉగాది పండుగ సెలవు
23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
24న అసెంబ్లి బిజినెస్