AP News: ప్రభుత్వానికి దేవినేని ఉమ ఘాటు ప్రశ్నలు

ABN , First Publish Date - 2023-03-08T20:15:10+05:30 IST

ఇరిగేషన్ ప్రోజెక్టుల పనులపై శ్వేతా పత్రము విడుదల చేయాలని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) డిమాండ్ చేశారు.

AP News: ప్రభుత్వానికి దేవినేని ఉమ ఘాటు ప్రశ్నలు

అమరావతి: ఇరిగేషన్ ప్రోజెక్టుల పనులపై శ్వేతా పత్రము విడుదల చేయాలని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) డిమాండ్ చేశారు. ‘‘కుటుంబం గురించి ఎవరూ మాట్లాడుతున్నారు? బూతులు మంత్రులను ఎవరు తయారు చేశారు? దొంగ ఓట్ల పరిస్థితి వైసీపీ (YCP) తీసుకుని వచ్చింది. వైసీపీ పారదర్శకంగా ఎన్నికలు జరిపేది. అమూల్య డైరీని ఎవరు తీరుకు వచ్చారు? పాల రైతులను ఎవరు దోచుకున్నారు?. లోకేష్ పాదయాత్ర వైసీపీలో వణుకు పుట్టిస్తోంది. లోకేష్ పాదయాత్ర రికార్డ్ సృష్టించబోతోంది?, ఒక్క జిల్లాకే వణికిపోతే ఎలా? ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి?. ఇరిగేషన్ గూర్చి మాట్లాడే అర్హత లేదు మీకు. హద్రీ‌నివా ఎందుకు ఆపేశారు?, 45 నెలల్లో ఎంత ఆయకట్టుకు నీరు ఇచ్చారు?, ఇరిగేషన్‌కు ఈ 45 నెలల్లో ఎన్ని వేల కోట్ల ఖర్చు చేశారు?, జగన్ కళ్ళల్లో ఆనంద చూడడానికి బూతులు మాట్లాడుతున్నారు. జగన్ నీ కూర్చి జనం లేకుండా చెస్తారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై లోకేష్ మాట్లాడుతున్నారు. జగన్ (CM Jagan) కూసిన కూతలు లోకేష్ (Lokesh) మాట్లాడారా?’’ అని ఉమ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-03-08T20:15:15+05:30 IST