Baji: ఆ పెయిడ్ ఆర్టిస్ట్‌లను మేము పట్టించుకోం

ABN , First Publish Date - 2023-09-23T18:09:05+05:30 IST

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీజేపీ(BJP) మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ(Shaik Baji) ఆరోపించారు.

Baji: ఆ పెయిడ్ ఆర్టిస్ట్‌లను మేము పట్టించుకోం

విజయవాడ: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీజేపీ(BJP) మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ(Shaik Baji) ఆరోపించారు. శనివారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో పరిస్థితిపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్డీ కొట్లో కూడా టీ తాగినా ఫోన్‌పే ఉంటుంది.. కానీ వందలు, వేలు పెట్టి కొన్నా మద్యం సీసాకు ఫోన్‌పే ఉండదు. అసమర్ధులతో నోటికొచ్చినట్లు తిట్టిస్తారా..? మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి(Purandhareswari) ఆధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక వ్యక్తిగత విబర్శలకు దిగుతారా.. మేం తలుచుకుంటే మీరు ఎంత..? వైసీపీ నేతలకు సిగ్గు శరం ఉంటే జగన్ మద్యం దోపిడీ జరగలేదని చెప్పగలరా...? డబ్బులు తీసుకుని మాట్లాడే పెయిడ్ ఆర్టిస్ట్‌లను మేము పట్టించుకోం...? జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఎక్కడ...? కేంద్రం అభివృద్ధి కోసం కోట్ల నిధులను విడుదల చేస్తే జగన్ తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. మహిళలపై వైసీపీ నాయకులకు ఏమాత్రం గౌరవం లేదు. పోలీసులపై నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి జగన్. ఇప్పుడు అదే పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారు. మద్యం ఆదాయాలపై జగన్ ప్రభుత్వం విడుదల చేయాలి. 16 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తిని ప్రజలు నమ్మరు. రైతులు, ఉద్యోగులు అందరూ జగన్‌ను ఎప్పుడు తరిమి కొడదామా అని ఎదురు చూస్తున్నారు’’ అని షేక్ బాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-23T18:09:15+05:30 IST