NCBN Arrest: చంద్రబాబు కేసులో తుది తీర్పు ఎప్పుడు..? కోర్టు లోపల.. బయటా టెన్షన్.. టెన్షన్!

ABN , First Publish Date - 2023-09-10T12:57:15+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా (Skill Development Case) ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే సీఐడీ తరఫు వాదనలు పూర్తి కాగా.. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

NCBN Arrest: చంద్రబాబు కేసులో తుది తీర్పు ఎప్పుడు..? కోర్టు లోపల.. బయటా టెన్షన్.. టెన్షన్!

విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా (Skill Development Case) ఏసీబీ కోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే సీఐడీ తరఫు వాదనలు పూర్తి కాగా.. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వాడివేడీగా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. ప్రస్తుతం కోర్టు భోజన విరామం ఇచ్చింది. భోజన విరామం తర్వాత మరోసారి కోర్టులో వాదనలు జరగనున్నాయి.

మరోవైపు కోర్టులో వాదనలు జరుగుతుండగానే ఏసీబీ కోర్టు ప్రాంతంలో వాతావరణం మాత్రం ఉత్కంఠ సాగుతోంది. టీడీపీ కార్యకర్తలు, నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వాదనలు పూర్తికాగానే మధ్యాహ్నం 3 గంటలకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెయిల్ రావాలంటూ టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకోవైపు కోర్టు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ పరిణామాలతో అసలేం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొంది.

చంద్రబాబు తరఫున లాయర్ లూథ్రా వాదనలు ఇలా..

ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపించారు. ‘‘స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం. చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదన్న కోర్టు. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామన్న అదనపు ఏజీ. 2021లో కేసు పెడితే ఇప్పటివరకూ ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయలేదన్న కోర్టు. 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించింది అన్న లూథ్రా, శుక్రవారం ఉ. 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ప్రస్తావించిన లూథ్రా. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలి. గవర్నర్ అనుమతిని సీఐడీ తీసుకోలేదు.’’ అని సిద్ధార్థ్‌ లూథ్రా కోర్టులో వాదనలు వినిపించారు.

Updated Date - 2023-09-10T13:13:36+05:30 IST