Buddha Venkanna : న్యాయమూర్తులను ధూషించారన్న అభియోగంపై బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు
ABN , First Publish Date - 2023-11-03T15:49:46+05:30 IST
న్యాయమూర్తులను ధూషించారన్న అభియోగంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ( Buddha Venkanna ) కు సీఐడీ ( CID ) అధికారులు నోటీసులు అందించారు.
అమరావతి: న్యాయమూర్తులను ధూషించారన్న అభియోగంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ( Buddha Venkanna ) కు సీఐడీ ( CID ) అధికారులు నోటీసులు అందించారు. హైదరాబాద్‌లో ఆరోగ్య పరీక్షల కోసం ఉన్న బుద్దా వెంకన్నకు హైదరాబాద్ వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు ఇస్తున్నట్టు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై బుద్దా వెంకన్న వెంటనే తగిన వివరణ ఇవ్వాలని సీఐడీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.