AP News: మంత్రి జోగి రమేష్‌పై జనసేన మహిళలు ఆగ్రహం.. గాజులు, చీర తీసుకెళ్తుండగా..!
ABN , First Publish Date - 2023-07-26T16:27:46+05:30 IST
బూతులు తిట్టే వారిని పోలీసులు వదిలేసే.. ప్రశ్నిస్తున్న వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా వాగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా? అంటూ నిలదీశారు.
కృష్ణా: జనసేన అధినేత పవన్‌కల్యాణ్(pawan kalyan)పై మంత్రి జోగి రమేష్ (jogi ramesh) చేసిన వ్యాఖ్యలపై జనసేన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికాని మంత్రి అంటూ గాజులు, చీర ఇచ్చేందుకు జనసేన మహిళా కమిటీ సభ్యులు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి విజయవాడ నుంచి పెడన బయలుదేరారు. మార్గమధ్యంలో గూడురు దగ్గర పోలీసులు కారును అడ్డగించి నిలిపివేశారు. అనంతరం మహిళా నేతలను ఉయ్యూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పోతిన మహేష్ ఖండన..
జనసేన మహిళా నేతల అరెస్ట్‌ను ఆ పార్టీ నేత పోతిన మహేష్ ఖండించారు. బూతులు తిట్టే వారిని పోలీసులు వదిలేసే.. ప్రశ్నిస్తున్న వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా వాగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా? అంటూ నిలదీశారు. వైసీపీ నాయకులు ఏం చేసినా చర్యలు లేవు కాబట్టే పేట్రేగిపోతున్నారని.. పోలీసు అధికారులు కూడా మానవత్వంతో ఆలోచించాలని పోతిన మహేష్ విజ్ఞప్తి చేశారు.