Minister Botsa: జగన్ అడ్డుకుంటే చంద్రబాబు గడ్డిపీకారా?
ABN , First Publish Date - 2023-05-04T15:46:12+05:30 IST
రాష్ట్రానికి తలమానికం భోగాపురం విమానాశ్రయం అని... విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి బొత్ససత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు.
అమరావతి: రాష్ట్రానికి తలమానికం భోగాపురం విమానాశ్రయం అని... విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి బొత్ససత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత చంద్రబాబు కడుపు మంటతో అక్కసు వెలిబుచ్చుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటం వల్లే భోగాపురం విమానాశ్రయం 2,300 ఎకరాలకు కుదించారని తెలిపారు. రైతులు ఎవరైనా ప్రభుత్వం తమకు అన్యాయం చేసింది అని చెప్పారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విమానాశ్రయం శంకుస్థాపన చేస్తే ఆనాటి కేంద్రం మంత్రి అశోక్ గజపతి రాజు ఎందుకు రాలేదని నిలదీశారు. చంద్రబాబు ఏది మాట్లాడినా రాజకీయం కోసమే అి విమర్శించారు. ఆనాడు ప్రజల తాలూకా ఇబ్బందులను.... ఈనాడు ప్రజల ఆనందాన్ని సీఎం ఆయన నోటితో చెప్పారన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ భోగాపురం ఎయిర్ పోర్ట్ అడ్డుకుంటే చంద్రబాబు గడ్డి పికారా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంద్ర అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై సిట్ వేస్తే కోర్ట్‌కు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో ఎన్ని దుర్మార్గాలు చేశారో రెండు రోజులు ఆగితే బయటకు వస్తాయని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై చంద్రబాబు కంపు నోరుతో చేసే విమర్శలు ఆపాలన్నారు. ‘‘రజనీకాంత్, చంద్రబాబు ఎవరి భజన వాళ్ళని చేసుకోమనండి. రజనీకాంత్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకని మా మంత్రులు అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే మాకెందుకు?. పవన్ కళ్యాణ్ గతంలో పాచి పోయిన లడ్డు అన్నారు... ఇపుడు సువాసన అంటున్నారు’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.