Raghurama: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. ఆధారాలు లేకుండా ఏం చేస్తారు?

ABN , First Publish Date - 2023-09-21T16:29:47+05:30 IST

న్యూఢిల్లీ: యడ్యూరప్పపై అవినీతి కేసులో ఆరోపణలు వస్తే అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమని న్యాయవాది ముకుల్ రోహత్గి ఆనాడు అన్నారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులో గవర్నర్ అనుమతి అవసరం లేదని ఎలా అంటున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

Raghurama: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. ఆధారాలు లేకుండా ఏం చేస్తారు?

న్యూఢిల్లీ: యడ్యూరప్ప (Yeddyurappa)పై అవినీతి కేసు (Corruption Case)లో ఆరోపణలు వస్తే అరెస్టు చేయాలంటే గవర్నర్ (Governor) అనుమతి అవసరమని న్యాయవాది ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) ఆనాడు అన్నారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేసు (Case)లో గవర్నర్ అనుమతి అవసరం లేదని ఎలా అంటున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) ప్రశ్నించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యడ్యూరప్ప విషయంలో అలా.. చంద్రబాబు నాయుడు అంశంలో ఇలా ఎందుకని నిలదీశారు. ఇప్పుడు సీఐడీ (CID) అధికారులు చంద్రబాబు నాయుడును రిమాండ్‌ (Remand)కు ఇవ్వాలని అడుగుతున్నారని.. ఆధారాలు లేకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. తనకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందన్నారు.

సుప్రీంకోర్టు (Supreme Court) గైడ్ లైన్స్ ప్రకారం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా హైకోర్టు (High Court)లో తీర్పు వచ్చే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ (Quash Petition)పై తీర్పు రాబోతోందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్‌లో కూడా 17ఏ వర్తిస్తుందన్నారు. లోకేష్ (Lokesh) ఢిల్లీలో ఉన్నారు.. రావడం లేదని ఆరోపణలు చేస్తున్నారని.. జగనే (Jagan) కోర్టుకు వెళ్లకుండా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. లోకేష్ ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడుతున్నారని, తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు కొడుకు తన బాధ్యత నిర్వహిస్తున్నాడన్నారు. లోకేష్‌ను కూడా ఎదో ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, రాజకీయ కక్షతోనే కేసు పెడుతున్నట్లు తెలుస్తోందని రఘురామ అన్నారు.

Updated Date - 2023-09-21T16:29:47+05:30 IST