Yuvagalam Padayatra: లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత.. పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2023-08-20T23:55:07+05:30 IST
విజయవాడ నగరంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న మార్గంలోని విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల(Vijayawada Siddhartha Engineering College) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
విజయవాడ(Vijayawada): విజయవాడ నగరంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న మార్గంలోని విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల(Vijayawada Siddhartha Engineering College) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘‘సైకో పోవాలి - సైకిల్ రావాలి’’ అని టీడీపీ శ్రేణులు డీజేలతో నినాదాలు చేశారు. అయితే ఈ క్రమంలో పోలీసులు కలగజేసుకుని డీజేను బంద్ చేయించారు. రాష్ట్రమంతా మార్మోగిన పాటని ఆపేది లేదని తెలుగుదేశం శ్రేణులు పోలీసులతో వారించారు. డీజేను బంద్ చేయడంతో పోలీసులు, తెలుగుదేశం నేతల మధ్య కొద్దిసేపు ఘర్షణ తలెత్తింది. పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ తలెత్తుతుండడంతో దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర పోలీసులకు నచ్చజెప్పి ఘర్షణ పెద్దదిగాకుండా చూశారు. దీంతో డీజే కొనసాగిస్తూ యువగళం పాదయాత్ర ముందుకు కదులుతోంది. కాగా ఈరోజు అర్ధరాత్రికి పైగా లోకేష్ పాదయాత్ర కొనసాగనున్నది. రాత్రి 11 గంటలు దాటిన లోకేష్‌ను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరినీ కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్ నుంచి ఈ పాదయాత్ర మొదలైంది. యువగళం పాదయాత్ర నిడమానూరు చేరుకోవడానికి మరో మూడు గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.