Nujiveedu Triple IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2023-10-07T17:14:35+05:30 IST

నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.

 Nujiveedu Triple IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆకలి కేకలు

ఏలూరు: నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా నాసిరకం భోజనం పెడుతున్నా ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్ం చేశారు. నాసిరకం భోజనం తినడంతో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. అర్థ ఆకలితోనే బాధపడతున్నారు. నాణ్యమైన ఆహారం పెట్టాలని పలుమార్లు ఆర్జీయూ కేటీ అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని అధికారల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉడకని అన్నం, రుచిపచి లేని పప్పు కూర, నీళ్ల రసం, గట్టి ఇడ్లీ, కుళ్లిన కోడి గుడ్లు, నాసిరకం చికెన్ పెట్టడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అశుభ్ర వాతావరణంలో మెస్‌లు కొనసాగిస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు పర్యవేక్షించడం లేదని విద్యార్థులు అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మానేసిన విద్యార్థులు నూజివీడు ట్రిపుల్ ఐటీలో బైఠాయించి ఆందోళనకు దిగారు.నాణ్యమైన ఆహారం అందించే వరకు ఆందోళనలను విరమించబోమని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-07T17:14:35+05:30 IST