Panchumurti Anuradha: వైసీపీ పాలనలో టీటీడీ అపవిత్రం

ABN , First Publish Date - 2023-01-24T13:29:20+05:30 IST

వైసీపీ పాలన (Ycp Government) లో పవిత్రమైన టీటీడీ (TTD) కుంభకోణాల మయంగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవాణి ట్రస్టు

Panchumurti Anuradha: వైసీపీ పాలనలో టీటీడీ అపవిత్రం
టీటీడీ అపవిత్రం

అమరావతి: వైసీపీ పాలన (Ycp Government) లో పవిత్రమైన టీటీడీ (TTD) కుంభకోణాల మయంగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవాణి ట్రస్టు (Srivani Trust)పై వైసీపీ నేతలు గుమ్మడికాయ దొంగల్లా భుజాలు తడుము కుంటున్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన రూ. 650 కోట్లు నిధులు ఏమయ్యాయి? ఎక్కడెక్కడ ఆలయాలు కట్టారో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? రూ.3096 కోట్ల బడ్జెట్‌లో దేనికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో స్పష్టత లేదు. భక్తులు ఇచ్చే విరాళాల లెక్కలు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? రూ. 150 ఉన్న గది అద్దె రూ. 1700, రూ. 25 ఉన్న లడ్డు రూ. 100కి పెంచారు. ఈ డబ్బులన్నీ ఎవరు స్వాహా చేస్తున్నారు?. టీటీడీ బోర్డు సభ్యుల్లో సగం మంది క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నవారే. జగన్ రెడ్డి.. అబ్దుల్ కలాం (Abdul Kalam) కంటే గొప్పవాడా? టీటీడీ రూల్ప్ పాటించరా? టీడీపీ బీసీలకు టీటీడీ చైర్మన్ ఇస్తే జగన్ రెడ్డి (Jagan) తన సొంత బాబాయ్‌కి కట్టబెట్టారు. నర రూప రాక్షసి రోజా (Rk Roja).. నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతోంది. తిరుమల దర్శనానికి వెళ్లి చంద్రబాబు (Chandrababu)ను బూతులు తిట్టడానికి సిగ్గుగా లేదా? టీడీపీ (tdp) హయాంలోనే తిరుమల పవిత్రత, అభివృద్ధికి పెద్ద పీట వేశాం. తిరుమలలో నిత్య అన్నధానం, 3 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రైగ్యులైజేషన్, స్విమ్స్, బర్డ్ యూనివర్సిటీల ఏర్పాటు టీడీపీ ఘనతే. తెలుగు గంగ నీరు తిరుమలకు ఇచ్చిన ఘనత టీడీపీదే.’’ నని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-01-24T13:29:32+05:30 IST