Pothina Mahesh: పవన్‌పై నోరు పారేసుకుంటే వైసీపీ నేతలను తరిమి కొడతాం
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:17 PM
ఇంకోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నోరు పారేసుకుంటే మంత్రి జోగి రమేష్ ( Minister Jogi Ramesh ) ని తరిమి కొడతామని ఆ పార్టీ సీనియర్ నేత పోతిన వెంకట మహేష్ ( Pothina Venkata Mahesh ) హెచ్చరించారు. జోగి రమేష్ వ్యాఖ్యలపై పోతిన వెంకట మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: ఇంకోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నోరు పారేసుకుంటే మంత్రి జోగి రమేష్ ( Minister Jogi Ramesh ) ని తరిమి కొడతామని ఆ పార్టీ సీనియర్ నేత పోతిన వెంకట మహేష్ ( Pothina Venkata Mahesh ) హెచ్చరించారు. జోగి రమేష్ వ్యాఖ్యలపై పోతిన వెంకట మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సెంట్ భూమి కింద ఇళ్లు నిర్మించే పథకం పేరుతో 35వేల కోట్లు లూఠీ చేశారని.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని జగన్, జోగి రమేష్‌కు సవాల్ విసిరారు. సీబీఐ, ఈడీ విచారణ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారని చెప్పారు. జగన్, జోగి రమేష్‌కు వణకు మొదలైందని.. దీంతో నోటికొచ్చినట్లు మట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం మహిళలను మోసం చేసి భారీ అవినీతికి పాల్పడింది. జగన్‌తో సహా మంత్రులు వేల కోట్లు దోచుకుని సంపన్నులు అయ్యారన్నారు. వైసీపీ నేతల ధన దాహంతో మహిళలను కూడా అప్పుల పాలు చేశారని చెప్పారు. దోపిడీకి కొత్త పాలసీనే ఈ ఇళ్ల నిర్మాణమని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అంశాల వారీగా పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 30లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. 29లక్షలే లబ్ధిదారులు ఉన్నారని ప్రభుత్వమే ప్రకటించిందని..21 లక్షల మందిని గుర్తించి, కేవలం 12లక్షల మందికే ఇళ్లు ఇచ్చారన్నారు. అది కూడా ఎందుకూ పనికిరాని కాగితాలు చేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. మూకుమ్మడిగా ఎక్కడైనా వైసీపీ ప్రభుత్వం గృహప్రవేశాలు చేయించిందా... పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చారా అని నిలదీశారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి 14,360 కోట్లు రాగా 11,358 కోట్లు మాత్రమే జగన్ ఖర్చు చేశారన్నారు. కేంద్రం డబ్బులు కొట్టేసి వైసీపీ నేతల బిల్డప్ ఏంటి.. జగన్ స్టిక్కర్లు ఏంటి అని పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు.
వైసీపీ ప్రచార ఆర్భాటంతో సాక్షి పేపర్, ఛానళ్లు లాభపడ్డాయన్నారు. మార్కెట్ రేటును మూడింతలు చేసి స్థానిక ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు దోచుకున్నది నిజం కాదా అని నిలదీశారు. 12వేల ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేశారని విమర్శించారు. వేల కోట్ల స్కాం జరిగిందంటే... వ్యక్తిగతంగా దూషణలకు దిగుతారా అని మండిపడ్డారు. కేంద్రం సొమ్ము కొట్టేస్తే... ప్రదాని మోదీకి లేఖలు రాయడం తప్పా అని ప్రశ్నించారు. వరంగల్లో జగన్‌పై రాళ్లతో దాడి చేసి తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. జగన్‌పై సొంత జిల్లాలో కూడా రాళ్లు విసిరి నిరసన తెలిపారని చెప్పారు. వైసీపీ చాప్టర్ ఇక క్లోజ్ అయిపోయింది.. ప్రజలు తిరగబడుతున్నారన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కల త్వరలోనే సాకారం అవుతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నీ వల్లే కదా పార్టీకి దూరంగా ఉన్నారన్నారు. జగన్‌కే తాను పోటీ చేయనని వసంత చెప్పలేదా అని ప్రశ్నించారు. జోగి రమేష్ అవినీతి వల్ల తన నియోజకవర్గ వైసీపీ నేతలే తనకు టిక్కెట్ ఇవ్వవద్దని జగన్‌కి చెప్పడం నిజం కాదా అని నిలదీశారు. జగన్‌పై కేసులు నిర్ధారణ అయ్యాయి కాబట్టే చంచల గూడ జైలుకు వెళ్లారన్నారు. ఆడుకో ఆంధ్రా మరో దోపిడీలో భాగమే.. అసలు స్థలాలే లేవని చెప్పారు. త్వరలోనే జగన్‌తో ప్రజలే ఆడుకుని తగిన బుద్ది చెబుతారని పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు.