Purandeswari: నేటి తరం దీన్ దయాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-09-25T22:17:22+05:30 IST
దీన్ దయాల్(Deen Dayal)ఉపాధ్యాయ మనోభావాలు ఈ సంకలనాల రూపంలో మన ముందుకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.
విజయవాడ: దీన్ దయాల్(Deen Dayal)ఉపాధ్యాయ మనోభావాలు ఈ సంకలనాల రూపంలో మన ముందుకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సభ నిర్వహించారు. కంప్లీట్ వర్క్స్ఆఫ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుతో 15 గ్రంధాల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ హాజరయ్యారు. దగ్గుబాటి పురంధరేశ్వరి, ఆర్.యస్.యస్ సహ క్షేత్ర ప్రచారక్ భరత్ జీ, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, మహేష్ చంద్ర శర్మ, మాధవ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ..‘‘ ఆయన ఆలోచనలపై ఈ పుస్తకాలు అవగాహన కల్పిస్తాయి.నేటి తరం ఈ పుస్తకాలు చదవాలి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి ఎన్నో తట్టుకుని నిలబడ్డారు. భారతీయ ముద్దు బిడ్డగా ఆయన్ను మనం గుర్తుంచు కోవాలి. మన సంస్కృతి ఉనికి కోల్పోకుండా... పాశ్చాత్య సంస్కృతిని అలవరచుకోడం ఆనాడే నేర్పారు. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన మేధావి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. మహనీయులు ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే నివాళి. పేదవారికి సంక్షేమం అందించాలనేది ఆయన సంకల్పం. బీజేపీ ప్రభుత్వం ఇదే సంక్షేమాన్ని పేదలకు అందిస్తోంది. గ్రామీణాభివృద్ధి, మన సంస్కృతిపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేది ఆయన ఆకాంక్ష. యోగా డే ద్వారా మన సంస్కృతి విశ్వవ్యాప్తంగా విస్తరించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్పతనం, ఆయన మార్గనిర్దేశం గురించి అందరూ తెలుసుకోవాలి. మహేష్ చంద్ర ద్వారా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు మనం తెలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అని దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు.