AP NEWS: నారా లోకేష్‌ను కలిసిన రంగన్నగూడెం గ్రామస్తులు

ABN , First Publish Date - 2023-08-24T13:02:32+05:30 IST

జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) చేతగాని, దివాలాకోరు పాలన గ్రామాలకు శాపంగా మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు.

AP NEWS: నారా లోకేష్‌ను కలిసిన రంగన్నగూడెం గ్రామస్తులు

విజయవాడ: జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) చేతగాని, దివాలాకోరు పాలన గ్రామాలకు శాపంగా మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. గురువారం నారా లోకేష్‌ను గన్నవరం నియోజకవర్గం(Gannavaram Constituency)లోని రంగన్నగూడెం గ్రామస్తులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామస్తులు లోకేష్‌తో మాట్లాడుతూ.. ‘‘వీరవల్లి-రంగన్నగూడెం గ్రామాల మధ్య 332క్రాసింగ్ గేటు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా ప్రారంభించాలి. వీరవల్లి-వట్టిగుడిపాడు రోడ్డు 7మీటర్ల వెడల్పుకు పెంచి నిర్మించాలి. రంగన్నగూడెం - వేలేరు వెళ్లే మండల పరిషత్ లింకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలి. రంగన్నగూడెం గ్రామంలోని అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా మార్చాలి. పోలవరం కుడి ప్రధాన కాలువ 129 కి.మీ వద్ద స్లూయిస్ నిర్మించాలి. పోలవరం కుడి ప్రధాన కాలువ 130కి.మీ వద్ద ఆర్ అండ్ బీ రోడ్డు ప్రక్కన స్లూయిస్ నిర్మించాలి’’ అని గ్రామస్తులు కోరారు.

గ్రామస్తుల విన్నపంపై నారా లోకేష్ స్పందన..

‘‘గ్రామపంచాయితీలకు కేంద్రం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.9వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి, కనీసం మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గత తెలుగుదేశం హయాంలో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30లక్షల ఎల్.ఈ.డీ వీధిదీపాలు వేశాం. గ్రామాల్లో రోడ్లు, లింకు రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.వైసీపీ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం. పోలవరం కుడి ప్రధాన కాలువపై అవసరమైన ప్రాంతాల్లో స్లూయిస్‌లు నిర్మిస్తాం’’ అని లోకేష్ అన్నారు.

Updated Date - 2023-08-24T13:14:27+05:30 IST