Devineni Uma: వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన దేవినేని ఉమ.. దేనికోసమంటే..!

ABN , First Publish Date - 2023-07-08T17:03:28+05:30 IST

చింతలపూడి ప్రాజెక్ట్‌కు 5 వేల కోట్లు మంజూరు చేస్తే రూ. 4100 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వస్తే చింతలపూడి ద్వారా గోదావరి నీరు ఎన్‌ఎస్‌పీ కాలువలో పారేవి. డ్యామ్‌లలో నీళ్లు ఉన్నా చెరువులకు నీరు వదలడం లేదు. చెరువులలో మట్టి అమ్ముకోవడం కోసం నీరు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారు.

Devineni Uma: వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన దేవినేని ఉమ.. దేనికోసమంటే..!

ఎన్టీఆర్ జిల్లా: చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీరు నాగార్జున సాగర్ కాలువల్లో పారిస్తానని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma Maheswara Rao) శపథం చేశారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్ర మైలవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. రెడ్డిగూడెంలో బస్సు యాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాలువ దగ్గర చింతలపూడి ఫైలన్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడారు. ‘‘చింతలపూడి ప్రాజెక్ట్‌కు 5 వేల కోట్లు మంజూరు చేస్తే రూ. 4100 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వస్తే చింతలపూడి ద్వారా గోదావరి నీరు ఎన్‌ఎస్‌పీ కాలువలో పారేవి. డ్యామ్‌లలో నీళ్లు ఉన్నా చెరువులకు నీరు వదలడం లేదు. చెరువులలో మట్టి అమ్ముకోవడం కోసం నీరు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారు. చింతలపూడి ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం (YCP Government) దెబ్బతిసింది. నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసి చింతలపూడి ప్రాజెక్ట్ ప్రాముఖ్యత‌ను వివరిస్తాను. చంద్రబాబు ఫైలన్ శంకుస్థాపన చేసిన ప్రదేశం ఒక దేవాలయం. సంఘ విద్రోహులు చేరి నాశనం చేస్తున్నారు. నా మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారు. నన్ను తుది ముట్టించవచ్చు. కొండపల్లిలో నా మీద, నా కారు మీద దాడి చేశారు. గోదావరిలో మునిగి పోకుండా గోదావరి తల్లి నన్ను బ్రతికించింది. నా జీవిత ఆశయం ఒక్కటే.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీరు నాగార్జున సాగర్ కాలువల్లోకి పారిస్తాను.’’ అని దేవినేని ఉమ ప్రకటించారు.

Updated Date - 2023-07-08T17:03:28+05:30 IST