Atchannaidu: జగన్‌కు తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా?
ABN , First Publish Date - 2023-05-07T10:55:53+05:30 IST
మణిపూర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: మణిపూర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Leader Kinjarapu Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడటంపై లేదా అని ప్రశ్నించారు. టీడీపీ (TDP) అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. జగన్‌కు (AP CM Jagan) తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా అంటూ మండిపడ్డారు. రంగులు వేయటం కోసం, మీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు గానీ ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోరా అంటూ నిలదీశారు. ప్రత్యేక విమానాల్లో తిరిగే ముఖ్యమంత్రి మణిపాల్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఒక విమానం కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మణిపాల్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను వెంటనే తీసుకురావాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.