Bonda uma: సజ్జలపై మండిపడ్డ బోండా ఉమ
ABN , First Publish Date - 2023-10-14T16:53:10+05:30 IST
చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉంటే వైసీపీకి డ్రామా లాగా కనిపించటం దారుణం. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బ తినడం నిజం. ఆయన డీహైడ్రషన్, స్కిన్ అలర్జీలతో బాధపడుతున్నారు. జగన్ రెడ్డి, చంద్రబాబు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్‌పై (Chandrababu Health) ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బోండా ఉమ (Bonda uma) కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉంటే వైసీపీకి డ్రామా లాగా కనిపించటం దారుణం. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బ తినడం నిజం. ఆయన డీహైడ్రషన్, స్కిన్ అలర్జీలతో బాధపడుతున్నారు. జగన్ రెడ్డి (Cm jagan), చంద్రబాబు అనారోగ్యంపై రాక్షస ఆనందం పొందుతున్నారు. చంద్రబాబుకి జైలు అత్తగారిల్లా అని సజ్జల అన్నారు. జగన్‌కే జైలు పుట్టిల్లా?, చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను డాక్టర్లు కాకుండా జైలు అధికారులు ఎలా ప్రకటిస్తారు?, డీఐజీ కన్న ముందే చంద్రబాబు బరువు తగ్గలేదు అని సజ్జాలకు ఎలా తెలిసింది?, జైలుపై డ్రోను ఎగిరినా జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించటానికి తాడేపల్లి అదేశాలే కారణం. జైలుకు వెళ్లే రోజు చంద్రబాబు బరువు 72 కేజీలు.. నిన్న డీఐజీ చెప్పింది 67 కేజీలు.. ఐదు కేజీలు తగ్గిన మాట వాస్తవమే కదా?.’’ అని బోండా స్పష్టం చేశారు.