TDP Leaders: ‘వివేకా హత్య కేసులో సూత్రధారుడు జగనే.. రాజశేఖర్ రెడ్డి బతికుంటే మాత్రం..’
ABN , First Publish Date - 2023-04-19T12:05:18+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతరులంతా పాత్రధారులు మాత్రమే అని..
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో (YS Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MOP YS Avinash Reddy), భాస్కర్ రెడ్డి, ఇతరులంతా పాత్రధారులు మాత్రమే అని.. సూత్రధారుడు మాత్రం జగన్మోహన్ రెడ్డే (AP CM) అని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న TDP Leader Budda Venkanna) ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి చెప్పే వివేకానంద రెడ్డిని హత్య చేశారన్నారు. సీబీఐ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే అసలు కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డేనని తేలిపోతుందని తెలిపారు. వివేకానంద రెడ్డిని చంపించి సానుభూతి ఓట్లు పొందవచ్చనే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ సక్సస్ అయిందన్నారు.
ఢిల్లీ పైరవీలకు జగన్ తెర: దేవినేని
వివేకా హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ పైరవీలకు జగన్మోహన్ రెడ్డి తెరలేపారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister Devineni Uma maheshwar Rao) విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో సీఎం అందుబాటులో ఉండాలని సీఎస్ చెప్పటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని నిన్నటి సీఎస్ ప్రకటనతో అర్ధమవుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీకి రావాల్సినవి ఏమీ తేకపోగా అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీ పర్యటనకు వంకలు వెదుక్కుంటున్నారని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే జగన్ వైఖరి చూసి నిజంగా చనిపోయేవాడన్నారు. చనిపోయిన వివేకా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్న జగన్మోహన్ రెడ్డి.. కోటలో కూర్చున్నా ఒక్కటే పేటలో కూర్చున్నా ఒక్కటే అని అన్నారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.