Kottu satyanarayana: చంద్రబాబు అరెస్ట్‌పై ఎలాంటి కక్ష సాధింపు లేదు
ABN , First Publish Date - 2023-10-17T14:15:03+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) ఎలాంటి కక్ష సాధింపు లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్ళు అవుతున్నా
నంద్యాల: టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) ఎలాంటి కక్ష సాధింపు లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్ళు అవుతున్నా తొందరపడలేదుగా?, ప్రభుత్వం చట్ట విరుద్ధంగా గాని అక్రమంగా గాని చంద్రబాబును అరెస్టు చేయలేదు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రహస్యాలన్నీ కేంద్రానికి తెలిశాయని.. నిఘా సంస్థలు కేంద్రానికి చేరవేశాయి. రాజమండ్రి జైల్లో భద్రత బాగుంది. దోమలు రాకుండా దోమ తెరలు వేసి రక్షణ కల్పిస్తాం. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు కానీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు.