Minister Buggana Rajender: చేదు అనుభవం.. న్యాయం చేయాలని శ్రీశైలం ముంపు బాధిత రైతులు మొరా

ABN , First Publish Date - 2023-08-08T22:03:26+05:30 IST

మంత్రి బుగ్గన రాజేందర్‌(minister Buggana Rajender)కు చేదు అనుభవం ఎదురైంది. కలెక్టరేట్ వద్ద మంత్రి బుగ్గనను శ్రీశైలం ముంపు బాధిత రైతులు(Srisailam flood affected farmers) అడ్డుకున్నారు.

Minister Buggana Rajender: చేదు అనుభవం.. న్యాయం చేయాలని శ్రీశైలం ముంపు బాధిత రైతులు మొరా

నంద్యాల: మంత్రి బుగ్గన రాజేందర్‌(minister Buggana Rajender)కు చేదు అనుభవం ఎదురైంది. కలెక్టరేట్ వద్ద మంత్రి బుగ్గనను శ్రీశైలం ముంపు బాధిత రైతులు(Srisailam flood affected farmers) అడ్డుకున్నారు.తమకు న్యాయం చేయాలని మంత్రిని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ సర్ది చెప్పారు.కలెక్టరేట్లోకి రైతులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది రైతులు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌(Nandikotkur MLA Arthur)ను కలిశారు. న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే ఆర్థర్‌(MLA Arthur)కు వికలాంగ రైతు పాదాభివందనం చేశాడు. వెంటనే రైతుకు కూడా ఎమ్మెల్యే ఆర్థర్ పాదాభివందనం చేశారు. శ్రీశైలం ముంపు బాధితుల ఫైల్ సెక్రటేరియట్‌లో పెండింగ్‌లో ఉందని త్వరలో క్లియర్ చేయిస్తానని ఎమ్మెల్యే ఆర్థర్ రైతులకు సర్ధి చెప్పారు.

Updated Date - 2023-08-08T22:03:26+05:30 IST