Jogi Ramesh: ప్రసంగంలో వీరావేశంతో ఊగిపోయిన మంత్రి జోగి.. ఆపాలంటూ సీఎం జగన్ సంజ్ఞలు.. అయినప్పటికీ
ABN , First Publish Date - 2023-07-24T15:57:04+05:30 IST
ఆర్ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) తన ప్రసంగంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ ప్రసంగం ఎలా ఉందంటే.. ఒకానొకద దశలో సీఎం కూడా అసహనానికి గురయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రాజకీయ విమర్శలు చేయడమే ఇందుకు కారణం. ప్రసంగ సమయంలో ప్రతిపక్ష నేతలను కుక్కలు, పందులు అంటూ చిందులు తొక్కారు.
అమరావతి: ఆర్ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) తన ప్రసంగంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ ప్రసంగం ఎలా ఉందంటే.. ఒకానొక దశలో సీఎం కూడా అసహనానికి గురయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రాజకీయ విమర్శలు చేయడమే ఇందుకు కారణం. ప్రసంగ సమయంలో ప్రతిపక్ష నేతలను కుక్కలు, పందులు అంటూ చిందులు తొక్కారు. జోగి రమేష్ ప్రసంగాన్ని ఆపాలంటూ సీఎం జగన్ (CM Jagan) సంజ్ఞలు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. ఎంతకీ మంత్రి ప్రసంగాన్ని అపకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ఒక దశలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి తన ప్రసంగంలో ’‘ఇళ్ళ నిర్మాణంపై తక్కువ... రాజకీయ విమర్శలు ఎక్కువ’’ చేశారు. ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేస్తూ మంత్రి జోగి రమేష్ వీరావేశంతో ఊగిపోయారు.
ఇంతకీ మంత్రి ఏమన్నారంటే..
‘‘సామాజిక సమతుల్యత అంటే పెత్తందారుల పక్కన పేదలు ఇళ్లు నిర్మించుకోవడమే. పెత్తందార్ల పక్కన పేదలు ఇళ్లు నిర్మించుకోవద్దని కోర్టుకు ఎక్కాడు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu). ఎన్నికల సీజన్‌లో చిత్తకార్తి కుక్కలు బయటికి వచ్చి మొరిగినట్లు మొరుగుతున్నారు. చంద్రబాబు ముసలి నక్క. పవన్ కళ్లాణ్ (Janasena Chief Pawan Kalyan) అనేవాడు పిచ్చికుక్క. పెళ్లాలను పార్టీలను మార్చుతాడు. మార్చడం తార్చడం పవన్ కళ్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఎంత మంది వచ్చినా మా జగన్న వెంట్రుక కూడా పీకలేరు. ఊరపంది ఒకడు తిరుగుతున్నాడు. మా జగనన్నకు నువ్వు పోటీ ఏంట్రా?’’ అంటూ ప్రతిపక్ష నేతలపై మంత్రి జోగి రమేష్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు.