TDP: నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2023-08-30T09:37:49+05:30 IST
ఏపీలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికార పార్టీ ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఆఫీసుకు వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు.
నెల్లూరు: ఏపీలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లతో (TDP Leader House Arrest) వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికార పార్టీ ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఆఫీసుకు వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను (TDP Leader) అడ్డుకుంటున్నారు. జిల్లాలోని అల్లీపురంలోని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan reddy)ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. సోమిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇబ్రహింపట్నంలో జరగబోయే ఇసుక సత్యాగ్రహానికి ఆయన వెళ్లకుండా కట్టడి చేశారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దేశంలోని ఈ రాష్ట్రంలో జరగనన్ని కుంభకోణాలు మరే రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. కేంద్రం, కేంద్ర నిఘా సంస్థలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు అందరి మీదకి వెళుతున్నాయి కదా? ఏపీ గురించి ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. సరైన విచారణ సాగిస్తే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ జైళ్లలో ఉంటారని... ఇటువంటి సీఎం రావడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అటు ఎన్టీఆర్ జిల్లాలోనూ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను గృహ నిర్బంధం చేయగా.. పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్‌లు చేస్తున్నారు.