Kakani Goverdhan Reddy: లోకేశ్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు | Minister Kakani Govardhan Reddy Hot comment on Lokesh Yuvagalma PadayatraNellore Andhrapradesh Suchi

Kakani Goverdhan Reddy: లోకేశ్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-14T14:10:49+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాఫ్ అని.. టీడీపీ వారే ఆ విషయం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని... కనీసం ఒక్క శాతమంటే 24 వేల మంది కూడా రాలేదన్నారు.

Kakani Goverdhan Reddy: లోకేశ్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్రపై (YuvaGalam Padayatra) మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాఫ్ అని.. టీడీపీ వారే ఆ విషయం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని... కనీసం ఒక్క శాతమంటే 24 వేల మంది కూడా రాలేదన్నారు. సెండాఫ్ ఇవ్వడానికి, ఆహ్వానించడానికి వచ్చిన వారంతా కలిపినా రెండుమూడు వేల మంది కూడా లేరని అన్నారు. లోకేశ్ పాదయాత్రకి లక్ష్యం లేదని.. అది పాదయాత్రలా లేదు, వాకింగ్ చేస్తున్నట్టు ఉందని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు కాబట్టే ప్రజలు మళ్లీ తిరిగి పట్టంకట్టారన్నారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం మళ్లీ‌ బీజేపీతో చేతలు కలపబోతున్నారని విమర్శించారు. ఆయనలా జగన్ ఎప్పుడూ బీజేపీ దగ్గర సాగిలపడలేదన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని.. క్యాడర్ ఎక్కడికి కదలలేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-06-14T14:10:49+05:30 IST