Kotamreddy: చెడు సంప్రదాయాలకు వైసీపీ ప్రభుత్వం స్వస్తి పలకాలి
ABN , First Publish Date - 2023-10-13T16:07:39+05:30 IST
టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు దంపతులకు ప్రాణహాని ఉంది. ఆయన ఇంటి ముందు అజ్ఞాత వ్యక్తులు సంచారిస్తున్నారు. గంజాయి అమ్ముతున్నాడంటూ కల్పితాలు సృష్టిస్తున్నారు.
నెల్లూరు: జిల్లాలో రాజకీయ వేధింపులు ఎక్కువైపోయాయని, చెడు సంప్రదాయాలకు వైసీపీ ప్రభుత్వం (Ycp Government) స్వస్తి పలకాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది (Kotamreddy Sridhar Reddy) డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు దంపతులకు ప్రాణహాని ఉంది. ఆయన ఇంటి ముందు అజ్ఞాత వ్యక్తులు సంచారిస్తున్నారు. గంజాయి అమ్ముతున్నాడంటూ కల్పితాలు సృష్టిస్తున్నారు. జిల్లా పోలీస్ అధికారులు చొరవ తీసుకోవాలి. గతంలో అనం వెంకటరమణ రెడ్ది చెప్పినా వినకపోవడంతో దాడి చేశారు. కప్పిర శ్రీనివాసులు వెంట నెల్లూరు జిల్లా టీడీపీ మొత్తం ఉంది. ఎలాంటి హాని జరిగినా దానికి ప్రభుత్వానిదే భాద్యత. అక్రమ కేసులు పెట్టాలని పోలీసులు చూస్తే కోర్టు మెట్లు ఎక్కుతాం. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతాం.’’ అని హెచ్చరించారు.
కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్ది...
‘‘జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆటకేక్కింది. టీడీపీలో బలమైన నేతలపై వేధింపులు మొదలు పెట్టారు. నెల్లూరు జిల్లాలో ఇంత వరకు వినిపించని పీడీ యాక్ట్ తెరమీదకి తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఎన్నికల్లో బయట ఉండకుండా చేసేందుకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ ప్రయత్నం చేస్తున్నారు. నేతల ప్రాణాలకు హాని తలపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా కార్యకర్తలను రక్షించుకునేందుకు ముందుంటాం.’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్ది వెల్లడించారు.