Nara lokesh: నెల్లూరు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ లోకేశ్
ABN , First Publish Date - 2023-06-14T15:43:01+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నాయుడుపల్లెలో రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ... టీడీపీ హయాంలోనే ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు. అనిల్ ఇరిగేషన్ మంత్రిగా జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తిచేయలేదని... వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి కూడా విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు.
నెల్లూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Lokesh YuvaGalam) జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నాయుడుపల్లెలో రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ... టీడీపీ హయాంలోనే ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు. అనిల్ ఇరిగేషన్ మంత్రిగా జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తిచేయలేదని... వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి కూడా విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. కాకాణి కోర్టులో చోరీ కేసు, సీబీఐ ఎంక్వయిరీలో బిజీగా ఉన్నారని యెద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదని... ఒక్క సమస్య పరిష్కారించ లేదని మండిపడ్డారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu)హయాంలో ఏర్పాటు అయిన వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, ప్రస్తుత ప్రభుత్వం కరెంటు బిల్లులు కట్టలేక మూతపడ్డాయన్నారు. హార్టికల్చర్‌ను నెంబర్ వన్‌గా చేస్తామని... రాయలసీమలో ఓ రైతు ఎకరా భూమిలో రూ.కోటి సంపాదించారని తెలిపారు. నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఓ ఎంపీ నకిలీ విత్తనాలు సరఫరా చేసి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాలని అరికడతామన్నారు. అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలో వచ్చాక గతంలో రైతుల కోసం అమలు చేసిన ఇన్‌పుట్ సబ్సీడీలన్నీ అమలు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.