Pattabhiram: కొడాలి నాని, వల్లభనేని వంశీపై పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు.. భారతిని రోడ్డు మీదకు తెచ్చింది..
ABN , First Publish Date - 2023-02-18T17:09:17+05:30 IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శలు గుప్పించారు.
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శలు గుప్పించారు. తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే యువగళం పాదయాత్రపై కొందరు విమర్శలు చేస్తున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. గుడివాడ గుట్కా గాడు కొడాలి నాని, పిల్ల సైకో వల్లభనేని వంశీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పట్టాభిరామ్ హెచ్చరించారు.
తాడేపల్లి సైకో డీఎన్ఏ (DNA) ఏంటో కొడాలి నాని తెలుసుకోవాలని, మీ సైకో డీఎన్ఏ (DNA) చంచల్గూడ జైలు అయితే.. లోకేష్ డీఎన్ఏ (DNA) ప్రపంచప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ అని పట్టాభిరామ్ మండిపడ్డారు. లోకేష్ దృష్టిలో డీఎన్ఏ (DNA) అంటే కట్టడం, నిర్మించడం, అభివృద్ధి చేయడమన పట్టాభిరామ్ అన్నారు. జగన్ దృష్టిలో డీఎన్ఏ (DNA) అంటే కూల్చడం, నాశనం చేయడమే అని పట్టాభిరామ్ తెలిపారు.
సీమను దోచుకోడానికే ఓబుళాపురం గనిని తీసుకొచ్చారని, లేపాక్షి హబ్ పేరుతో సీమలోని వేలఎకరాలు మింగేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. సైకో జగన్ సొంతనియోజకవర్గానికి నీళ్లిచ్చిన డీఎన్ఏ (DNA) చంద్రబాబుదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. చంద్రబాబు తెచ్చిన కియా అనుబంధ సంస్థలను తరిమికొట్టిన డీఎన్ఏ (DNA) జగన్ది అని, భారతిని రోడ్డు మీదకు తీసుకువచ్చింది మీ సైకోనే అని పట్టాభిరామ్ మండిపడ్డారు.
ఇటీవల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలంతా ‘మా దరిద్రం నువ్వే జగన్’ (Jagan is our Poverty) అంటున్నారని, అమరావతి నిర్మాణం ఆపేసిన జగన్ రెడ్డి, రాజధాని నిర్మిస్తున్నాని చెప్పి బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకున్నారని అన్నారు. నిన్న అప్పుకట్టాలంటూ సీఆర్డీఏ (CRDA) అధికారుల్ని బ్యాంకర్లు నిలదీశారన్నారు. 2019 డిసెంబర్‌లో రాష్ట్రానికి ఇకపై మూడు రాజధానులు (Three Capitals)ఉంటాయని, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్న ముఖ్యమంత్రి.. సీఆర్డీఏ సంస్థ ద్వారా అమరావతి ముసుగులో ఏ ముఖం పెట్టుకొని రూ.3,013 కోట్ల అప్పుచేశారని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
**********************************************
‘తెలంగాణలో శాంతియుతం.. దేశంలో విచిత్ర పరిస్థితులు’
ఫాసిస్టు, ఫ్యాక్షనిస్టు = జగన్
****************************************