Adimulapu suresh: చంద్రబాబు అరెస్టులో రాజకీయ కోణం లేదు
ABN , First Publish Date - 2023-09-11T10:36:45+05:30 IST
టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టులో రాజకీయ కోణం లేదని తెలిపారు.
ప్రకాశం: టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) అరెస్ట్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Minister Adimulapu Suresh) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టులో రాజకీయ కోణం లేదని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చూసింది గోరంతే అని.. అమరావతి, టిడ్కో హౌస్‌ల్లో జరిగిన స్కామ్‌లు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. అందులో చంద్రబాబు, ఆయన సహచరులైనా, ఆయన కుమారుడు ఉన్నా వదిలిపెట్టమన్నారు. జగన్ ప్రభుత్వం జవాబుదారీతనంతో పని చేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చింది.