YCP Leaderes : మళ్లీ బరి తెగించిన వైసీపీ రౌడీ మూకలు
ABN , First Publish Date - 2023-10-17T15:39:52+05:30 IST
వైసీపీ ( YCP ) రౌడీ మూకలు మరోసారి బరితెగించారు. కొత్తమ్మతల్లి సాక్షిగా వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు దిగారు. కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ( Kotobommali Kothammathalli ) ఆలయ ఈఓ రాధాకృష్ణపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు.
శ్రీకాకుళం: వైసీపీ ( YCP ) రౌడీ మూకలు మరోసారి బరితెగించారు. కొత్తమ్మతల్లి సాక్షిగా వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు దిగారు. కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ( Kotobommali Kothammathalli ) ఆలయ ఈఓ రాధాకృష్ణపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఎలా స్వాగతం పలుకుతారని ఈఓను వైసీపీ నేతలు నెట్టివేశారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు పూజలు చేస్తున్న సమయంలో వైసీపీ నేత దువ్వడ వాణి అక్కడికి వచ్చారు. దువ్వాడ వాణికి ప్రోటోకాల్ ఇవ్వలేదంటూ ఈఓపై కొంతమంది వైసీపీ రౌడీ మూకలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈఓ రాధాకృష్ణను దువ్వాడ వాణి అనుచరులు బయటకు నెట్టివేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ఆలయ ఈఓ రాధాకృష్ణకు పోలీసులు రక్షణ కల్పించారు.