TDP : పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న టీడీపీ

ABN , First Publish Date - 2023-08-24T11:06:36+05:30 IST

పోలీసులు ఇచ్చిన నోటీసులకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. గన్నవరం బహిరంగ సభ నిర్వహణపై యువగళానికి నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. గన్నవరం బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తమ నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ లోకేష్, కొనకళ్ల నారాయణకు ఆదేశాలు జారీ చేశారు.

TDP : పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న టీడీపీ

అమరావతి : పోలీసులు ఇచ్చిన నోటీసులకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. గన్నవరం బహిరంగ సభ నిర్వహణపై యువగళానికి నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. గన్నవరం బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తమ నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ లోకేష్, కొనకళ్ల నారాయణకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రిని నిలదీస్తే, పోలీసులకు అది తప్పుగా ఎలా కనిపించిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తన ప్రసంగంలో లోకేష్, అయ్యన్న పోలీసులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారని టీడీపీ చెబుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు బాధితులపైనే అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా? టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీని లోకేష్ ప్రశ్నిస్తే, పోలీసులెందుకు అధికార పక్షాన్ని వెనకేసుకొస్తున్నారని తెలుగుదేశం వర్గాలు ప్రశ్నిస్తున్నారు.

అయ్యన్న వ్యాఖ్యలు తప్పైతే పర్యాటకాభివృద్ధికి రోజా ఏం చేసిందో పోలీసులు సమాధానం చెప్తారా? అని నిలదీస్తున్నారు. వీటన్నింటిని సభా వేదిక ద్వారా ప్రశ్నించడం తప్పెలా అవుతుందని నేతలు అడుగుతున్నారు. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక ఇవ్వడం జరిగిందని.. ఇప్పుడు ఇసుక ధరలు అధికంగా పెరిగి, భవన నిర్మాణ రంగం కుదేలవటానికి ముమ్మాటికీ జగన్ అవినీతే కారణమని టీడీపీ స్పష్టం చేస్తోంది. ఇదే అంశాన్ని లోకేష్ ప్రస్తావించటం తప్పు ఎలా అవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీ సభలో ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నించి, హామీల విస్మరణను విమర్శిస్తే పోలీసులకు సంబంధం ఏముంటుందని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-08-24T11:06:36+05:30 IST