AP Capitals : YS Jagan రాజధాని కామెంట్స్‌పై ఒక్క మాటలో ఉండవల్లి రియాక్షన్.. సున్నితంగానే...

ABN , First Publish Date - 2023-01-31T17:37:12+05:30 IST

ఏపీ మూడు రాజధానులపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతుండగానే.. కాబోయే రాజధాని (AP Capital) విశాఖకు..

AP Capitals : YS Jagan రాజధాని కామెంట్స్‌పై ఒక్క మాటలో ఉండవల్లి రియాక్షన్.. సున్నితంగానే...

అమరావతి : ఏపీ మూడు రాజధానులపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతుండగానే.. కాబోయే రాజధాని (AP Capital) విశాఖకు (Visakha) రావాలని ఇన్వెస్టర్లను సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కోరడంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ వ్యాఖ్యలను న్యాయ నిపుణులు తప్పబడుతుండగా.. మేథావులు, రాజకీయ ప్రముఖులు (Political Celebrities) ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించగా.. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) మీడియాతో మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలపై (Jagan Comments) అసలు స్పందించనంటూనే రియాక్ట్ అయ్యారు ఉండవల్లి. రాజధానిపై ఏం చేసినా చట్టబద్దత ఉండాలని.. జగన్ చేసిన వ్యాఖ్యలు సున్నితమైన అంశమన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి తాను స్పందించనని ఒక్కమాటతో ముగించేశారు ఉండవల్లి.

కేంద్రానిదే బాధ్యత..!

ఇదే ప్రెస్‌మీట్ వేదికగా పలు విషయాలు ఉండవల్లి పంచుకున్నారు.పోలవరం (Polavaram) ప్రాజెక్టుపై కేవీపీ (KVP) దాఖలు చేసిన పిల్‌లో (PIL) నేను ఇంప్లీడయ్యాను. 2017 నుంచి విచారణకు కోర్టులో (Court) రాలేదు. చీఫ్ జస్టిస్ నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్నారు. ఛత్తీస్‌గడ్ తరపున అడ్వకేట్ జనరల్‌గా పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) తరపున వాదనలు వినిపించానని బెంచ్ నుంచి తప్పుకున్నారు. వేరే బెంచ్‌కి బదిలీ చేస్తున్నట్లు సీజే చెప్పారు. మేం దాఖలు చేసిన పిటిషన్‌పై వినడానికి ఏడేళ్లు సమయం పట్టింది. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు. సెక్షన్ 90 (Section-90) ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదిఅని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

Ys-Jagan.jpg

అయ్యే పనేనా..!

2014 రేట్ల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయం భరిస్తామని కేంద్రం (Central Govt) చెబుతోంది. 2014 రేట్లతో 2023లో ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యం అవుతుందా...?. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అందరు అనుకుంటున్నారు కానీ అయ్యే అవకాశం లేదు. చంద్రబాబు (Chandrababu) 2014 రేట్ల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పుకున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఎలా ఒప్పుకున్నారో చెప్పాలని ఆర్టీఐ (RTI) ద్వారా అడిగితే ఆధారాలు (Proofs) లేవని చెబుతోంది. పోలవరం ప్రాజెక్ట్ గురించి హైకోర్టు వాదనలు విని ఉంటే మొత్తం అన్ని అంశాలు వివరించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌పై కౌంటర్ ఫైల్ చేయలేదు అని ఉండవల్లి మీడియాకు వెల్లడించారు.

ఇంతకీ.. ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ ఏంటి..?

డయా ఫ్రమ్‌ వాల్ సంగతేంటి..?

ప్రాజెక్ట్ డయా ఫ్రం వాల్ (Dia from wall) ఉందో.. లేదో తెలియట్లేదు.. కొట్టుకుపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే డిజైన్లో లోపాలు ఉన్నాయా అనేది చూడాల్సి వస్తుంది. రూ. 35 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి పోలవరం ప్రాజెక్టు కట్టగలదా..?. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం ఎలా అయ్యిందో చంద్రబాబు చెప్పాలి..?. పోలవరం కాలువలు వైఎస్సార్ తవ్వాడు. ఆర్ అండ్ ఆర్ పూర్తి కాకుండా చంద్రబాబు 70 శాతం ప్రాజెక్ట్ అయ్యిందని ఎలా చెప్తారు..?. కాలువలు, రాక్ ఫీల్ డ్యాం, కాఫర్ డ్యాం (Cofferdam), స్పిల్ వే, ఆర్ అండ్ అర్ ఇవన్ని కలిపితే పోలవరం ప్రాజెక్టు అవుతుంది. మెయిన్ డ్యాం నిర్మాణం అవ్వకుండా ప్రాజెక్ట్ అయిపోయిందని ఎలా చెబుతారు..?. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి పోలవరం ప్రాజెక్ట్‌పై కౌంటర్ దాఖలు చేయలేదు. కోర్టు మా వాదనలు వింటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఫేవరబుల్ ఆర్డర్ వస్తుందిఅని మీడియాకు ఉండవల్లి వివరించారు. మాజీ ఎంపీ కామెంట్స్‌పై టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) నేతలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాలి మరి.

Updated Date - 2023-01-31T18:17:51+05:30 IST