KGH ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-02-17T15:05:07+05:30 IST

కేజీహెచ్‌ (KGH) ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు (ST Commission Chairman Kumbha Ravi Babu) స్పందించారు. ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజీహెచ్‌లో గురువారం జరిగిన సంఘటన వివరాలను

KGH ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏమన్నారంటే..!
ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏమన్నారంటే..!

విశాఖ: కేజీహెచ్‌ (KGH) ఘటనపై ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు (ST Commission Chairman Kumbha Ravi Babu) స్పందించారు. ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేజీహెచ్‌లో గురువారం జరిగిన సంఘటన వివరాలను సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. అలాగే శిశువుకు అందించిన చికిత్సా వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. శిశువు మృతి తర్వాత ఎస్టీ సెల్ (ST cell) కేజీహెచ్‌కి సరైన సమాచారం ఇచ్చినట్లైతే ఈ పరిస్థితి వచ్చేది కాదని వెల్లడించారు. మృతి చెందిన శిశువును తల్లిదండ్రులే పర్సనల్‌గా తీసుకెళ్లారన్నారు. ఒక అరగంట సేపు శిశువు తల్లిదండ్రులు ఆగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. అయినా కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రవిబాబు స్పష్టం చేశారు.

కేజీహెచ్‌లో గురువారం శిశువు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని దాదాపు 120 కిలోమీటర్లు స్కూటీ (Scooty)పై తల్లిదండ్రులు తీసుకెళ్లిన సంఘటన తెలిసిందే. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై ప్రభుత్వాన్ని (Ycp Government) విమర్శించారు.

Updated Date - 2023-02-17T15:05:08+05:30 IST