Boragam Srinivasulu: జగన్ పాలనలో నిరుద్యోగ సమస్య, ఉపాధి కొరతతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
ABN , First Publish Date - 2023-01-06T19:41:23+05:30 IST
వైసీపీ (YCP) పాలనలో జగన్ రెడ్డి (Jagan Reddy) పన్నుల బాదుడుతో అధిక ధరలు, నాసిరకం మద్యం అమ్మకాలు పెరిగాయని పోలవరం నియోజకవర్గ (Polavaram Constituency) టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు.
ఏలూరు జిల్లా: వైసీపీ (YCP) పాలనలో జగన్ రెడ్డి (Jagan Reddy) పన్నుల బాదుడుతో అధిక ధరలు, నాసిరకం మద్యం అమ్మకాలు పెరిగాయని పోలవరం నియోజకవర్గ (Polavaram Constituency) టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు. నిరుద్యోగ సమస్య, ఉపాధి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రజలు 15 రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం గ్రామంలో జరిగిన 'ఇదేం ఖర్మ' మన రాష్ట్రానికి ప్రారంభ కార్యక్రమంలో టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. టీడీపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అందుకు మద్దతుగా అందరూ +91 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని బొరగం శ్రీనివాసులు కోరారు.