MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతున్న వైసీపీ ప్రలోభాలు

ABN , First Publish Date - 2023-03-08T16:53:20+05:30 IST

పెద్దల సభ సమరం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే ఎన్నికలకు (MLA election) తీసిపోకుండా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) వైసీపీ ప్రలోభాలు కొనసాగుతున్నాయి.

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతున్న వైసీపీ ప్రలోభాలు

నెల్లూరు: పెద్దల సభ సమరం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే ఎన్నికలకు (MLA election) తీసిపోకుండా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) వైసీపీ ప్రలోభాలు కొనసాగుతున్నాయి. టీచర్లకు విందు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ (MLA Ramireddy Pratap) బెదిరింపులకు దిగారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి (YCP MLC candidate)తో పరిచయం కార్యక్రమం పేరుతో ఓటు వేయాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలకు తీసిపోకుండా ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లోలాగా ఈ ఎన్నికల్లో ఓటు వేసే మేధావులను కూడా తమ వైపు తిప్పుకోడానికి అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. పదవులు ఏవైతేనేమి? వాటి పేరు ఏదైతేనేమి? ఎన్నికలన్నాక ఓట్ల కొనుగోలు తప్పదని ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

కడప జిల్లాలో ఇదే పరిస్థితి

విజ్ఞతతో ఓటు వేయాల్సిన విద్యావంతులు, ఉపాధ్యాయులను పెద్దల సభకు వెళ్లడానికి పోటీ పడుతున్న అభ్యర్థులు తీవ్ర ప్రలోభాలకులోను చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరుతున్న అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు ప్రలోభాలకు దిగుతున్నారు. సీఎం సొంత జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు టీచర్లకు లంచ్ బాక్కులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా (Kurnool District)లో ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు ఓటుకు రూ.5 వేలు పంపిణీ చేయడమే కాకుండా డిన్నర్లు కూడా ఆఫర్‌ చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. పట్టభద్రులకు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2,000 పైగా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఓట్లకు కూడా గాలం వేస్తున్నారు.

Updated Date - 2023-03-08T16:53:20+05:30 IST