Devineni: బాబాయ్ హత్య కేసులో తమ్ముడిని కాపాడేందుకు జగన్...

ABN , First Publish Date - 2023-05-17T17:52:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సంచలన ఆరోపణలు చేశారు.

Devineni: బాబాయ్ హత్య కేసులో తమ్ముడిని కాపాడేందుకు జగన్...

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సంచలన ఆరోపణలు చేశారు. బాబాయ్ హత్య కేసు రేటు రూ. 40 కోట్లు అని, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Vivekanandareddy Murder Case) సాక్షులు ఉరేసుకుంటున్నారని, వివేకా హత్య కేసులో అందరూ దస్తగిరిగా మారుతామని చెబుతున్నారని, ఇంత మంది దస్తగిరులను సీబీఐ అధికారులు ఏం చేసుకుంటారని దేవినేని ఉమ ప్రశ్నించారు. బాబాయి హత్య కేసులో తమ్ముడిని కాపాడుకునేందుకు జగన్ మళ్లీ ఢిల్లీ పోతున్నారని దేవినేని ఉమ విమర్శించారు.

రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోపిడీ చేసి ఆ డబ్బులు తాడేపల్లికి చేర్చారని ఆరోపించారు. లక్షా 31 వేల కోట్ల విలువైన నాసిరకం మద్యం ప్రజలతో తాగించారని మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర గౌరవంగా ఉన్న నాయకులు, అధికారులు జగన్ దగ్గర చేరి సీబీఐకి చిక్కారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ పని చేశారని, ఆత్మవిశ్వాసం నినాదంతో చంద్రబాబు పని చేశారని, 22 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటే తప్పుడు కేసులు ఎప్పుడూ పెట్టలేదని దేవినేని ఉమ గుర్తు చేశారు.

Updated Date - 2023-05-17T17:52:57+05:30 IST