Budget 2023: బడ్జెట్ 2023లో ఈ 5 కీలక ప్రకటనలకు అవకాశం.. అవి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-01-18T21:13:33+05:30 IST

కేంద్ర బడ్జెట్ 2023కు (Union Budget2023) సమయం సమీపిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పార్లమెంట్‌లో (Parliment) పద్దును ప్రవేశపెట్టనున్నారు. మరి ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఒక లుక్కేద్దాం...

Budget 2023: బడ్జెట్ 2023లో ఈ 5 కీలక ప్రకటనలకు అవకాశం.. అవి ఏంటంటే..

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023కు (Union Budget2023) సమయం సమీపిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పార్లమెంట్‌లో (Parliment) పద్దును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మౌలికాభివృద్ధిపై (Infra) కేంద్రం దృష్టిసారించనుందనే అంచనాలున్నాయి. అంతేకాకుండా పన్ను ప్రయోజనాల రూపంలో ప్రజలకు కూడా ఉపశమనం కల్పించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వ్యయాలు, ద్రవ్యలోటు (fiscal deficit), ద్రవ్యోల్బణం (infla విషయంలో ప్రభుత్వ ప్రణాళికలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మూలధన, రెవెన్యూ వ్యయాలు అంచనాల కంటే ఎక్కువగా ఉంటే ద్రవ్యలోటు (Fiscal deficit) పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పర్యవసానంగా ప్రభుత్వం మార్కెట్ రుణ సేకరణ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఫలితంగా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడొచ్చని అంచనాల నేపథ్యంలో బడ్జెట్ 2023పై అందరి దృష్టి పడింది. మరి బడ్జెట్‌లో ప్రధాన ప్రకటనలు ఏవిధంగా ఉండబోతున్నాయి?, ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఒక లుక్కేద్దాం...

ద్రవ్యలోటు లక్ష్యం కుదింపు..

ఏప్రిల్ 1, 2023 నుంచి మొదలుకానున్న ఆర్థిక సంవత్సరానికి(Fiscal Year) సంబంధించి ద్రవ్యలోటు లక్ష్యాన్ని (Fiscal deficit) 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశం ఉందని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ గ్రూప్ (Goldman Sachs Group) అంచనా వేసింది. జీడీపీలో (GDP) ద్రవ్యలోటు 5.9 శాతంగా ఉండొచ్చని ఆండ్ర్యూ టిల్టన్, శాంతాను సెన్‌గుప్తా రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు మూలధన వ్యయాలను నిర్వహిస్తూనే సంక్షేమ వ్యయాలను పెంచొచ్చనే విశ్లేషణలున్నాయి. అందుకే గ్రామీణ ఉపాధి, గృహ రంగంపై ఫోకస్ ఉండొచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

బేసిక్ పన్ను మినహాయింపు పరిమితి పెంపు..

వ్యక్తిగత చెల్లింపుదారులకు (Individual taxpayers) ప్రస్తుతం ట్యాక్స్ స్లాబు (Tax slab) బేసిక్ మినహాయింపు పరిమితి (Exemption limit) రూ.2.5 లక్షలుగా ఉంది. దీనర్థం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న చెల్లింపుదార్లు ఆదాయ పన్ను దాఖలు చేయాల్సి అవసరం లేదు. 2014-15 నుంచి ఎలాంటి మార్పు జరగలేదు. అయితే ఈసారి బడ్జెట్2023లో ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రామాణిక మినహాయింపు రెట్టింపు..

ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న ప్రామాణిక మినహాయింపును (Standard deduction) రూ.1 లక్షకు పెంచాలని చెల్లింపుదారులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రామాణిక మినహాయింపును ఈ బడ్జెట్‌లో రెట్టింపు చేయొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో వేచిచూడాలి.

మౌలికం, సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు..

బడ్జెట్2023లో మౌలికరంగ కేటాయింపులు మరింత పెరగొచ్చనే విశ్లేషణలున్నాయి. తద్వారా రానున్న సంవత్సరాల్లో భారీ మౌలికరంగ ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలున్నాయి. 2024లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మౌలిక ప్రాజెక్టులు, సామాజిక రంగ సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గృహ రుణ వడ్డీ మినహాయింపు పరిమితి పెంపు?

ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) సెక్షన్ 24(b) ప్రకారం.. గృహరుణంపై చెల్లించే వడ్డీలో చెల్లింపుదారులు మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ పరిమితి ఏడాదికి రూ.2 లక్షలుగా ఉంది. గత కొన్నేళ్ల వ్యవధిలో ప్రొపర్టీస్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ పరిమితిని పెంచొచ్చనే అంచనాలున్నాయి.

Updated Date - 2023-01-18T21:24:01+05:30 IST