AP Tenth Results: ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇలా చూసుకోవచ్చు..!

ABN , First Publish Date - 2023-05-06T11:17:28+05:30 IST

ఏపీ పదో తరగతి ఫలితాలు (AP Tenth Results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స

AP Tenth Results: ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇలా చూసుకోవచ్చు..!
AP Tenth Results

విజయవాడ: ఏపీ పదో తరగతి ఫలితాలు (AP Tenth Results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విజయవాడలో విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 6,05,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది పరీక్ష రాశారు. ఏప్రిల్ 3 నుంచీ 18 వరకు పరీక్షలు జరిగాయి. ఇక ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. రికార్డు సమయంలో 18 రోజుల్లోనే పది ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది.

27e86d30-81c3-4c27-8d33-746633b0e6d2.jpg

మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలురు కంటే అధికంగా 6.11 శాతం బాలికలు పాస్ అయ్యారు. మొదటి స్థానంలో పార్వతీపురం జిల్లా.. చివరి స్థానంలో నంద్యాల జిల్లా నిలిచింది. ఇక జూన్‌ 2 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స తెలిపారు. అలాగే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఈనెల 13వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 933 పాఠశాలల్లో మాత్రం వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి వెల్లడించారు. ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని విద్యాశాఖ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించింది.

d41ac73e-001a-4151-ace9-82f80a30245f.jpg

ఉత్తీర్ణత ఇలా..

  • 69.27 శాతం బాలురు ఉత్తీర్ణత

  • 75.38 శాతం బాలికలు ఉత్తీర్ణత

  • 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత

  • 38 పాఠశాలల్లో ‘0’ శాతం ఉత్తీర్ణత

  • 84.7 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం జిల్లా టాప్

  • 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా లాస్ట్

  • జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

  • సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన చివరు తేదీ మే 17

  • రీ కౌంటింగ్, రీ వేరిఫికేషన్ దరఖాస్తు కు చివరి తేదీ మే 13

  • గత ఏడాదితో పోల్చితే ఈ సారి 5 శాతం ఉత్తీర్ణత పెరుగుదల

Updated Date - 2023-05-06T11:52:51+05:30 IST