Share News

Rajasthan poll manifesto: రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే..

ABN , First Publish Date - 2023-11-21T12:32:57+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) ప్రకటించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మేనిఫెస్టోని విడుదల చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే కుల సర్వే (Caste Survey) చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Rajasthan poll manifesto: రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే..

జైపూర్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) ప్రకటించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మేనిఫెస్టోని విడుదల చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే కుల సర్వే (Caste Survey) చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పంచాయతీ స్థాయిలో నియామకాలు చేపడతామని, సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రజల నుంచి అందిన సలహాలు, సూచనల ఆధారంగా ఎన్నికల హామీలను రూపొందించామని, 2018 ఎన్నికల హామీల్లో 96 శాతం నెరవేర్చామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆర్థికాభివృద్ధి విషయంలో ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉందని అశోక్ గెహ్లాట్ చెప్పారు. ఏడాది చివరి నాటికి రాజస్థాన్ ఆర్థిక స్థితి రూ.15 లక్షల కోట్లుగా ఉందని, 2023 నాటికి రూ.30 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమని అన్నారు. కాగా ‘జన్ ఘోష్న పత్ర’ పేరిట మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ పాల్గొన్నారు.


కాంగ్రెస్ కీలక హామీలు ఇవే..

నవంబర్ 25న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే ‘ఏడు గ్యారంటీలు’ అమలు చేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. పంచాయతీ స్థాయిలో ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు, కుల గణనను ప్రధానంగా ఉన్నాయి.

- కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు

- 1.04 కుటుంబాలకు కేవలం రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్

- పశు పోషకదారుల నుంచి కేజీ రూ.2 చొప్పున పేడ కొనుగోలు

- రూ.25 లక్షల - రూ.50 లక్షల వరకు ‘చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్

- ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కోసం చట్టం

- ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు/ట్యాబ్స్

- సహజ విపత్తుల కారణంగా ఎవరైనా మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.15 లక్షల ఇన్సూరెన్స్

కాగా బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. బీజేపీ తమ పథకాలను కాపీ కొడుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్ని వాగ్దానాలు చేసినా గెలిచేది కాంగ్రెస్సేనని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా రాజస్థాన్‌లో తప్పకుండా కుల గణన చేపడతామన్నారు.

Updated Date - 2023-11-21T12:32:58+05:30 IST