Rajasthan : మోదీ సమక్షంలోనే అశోక్ గెహ్లాట్ వ్యంగ్యాస్త్రాలు

ABN , First Publish Date - 2023-05-10T16:52:23+05:30 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Rajasthan chief minister Ashok Gehlot) తన అనుభవాన్ని రంగరించి ప్రధాన మంత్రి

Rajasthan : మోదీ సమక్షంలోనే అశోక్ గెహ్లాట్ వ్యంగ్యాస్త్రాలు
Narendra Modi, Ashok Gehlot

రాజసమంద్ (రాజస్థాన్) : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Rajasthan chief minister Ashok Gehlot) తన అనుభవాన్ని రంగరించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షాలను గౌరవించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది చాలా ముఖ్యమని వివరించారు. రాజసమంద్ జిల్లా, నాథ్‌ద్వార పట్టణంలో రూ.5,500 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం జరిగిన కార్యక్రమంలో మోదీ, గెహ్లాట్ బుధవారం పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గెహ్లాట్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కూడా ఆ దిశలోనే నడుస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రతిపక్షాలను గౌరవిస్తే, అధికార, ప్రతిపక్షాలు కలిసి, దేశానికి మరింత ఉత్సాహంగా సేవ చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో శత్రుత్వం ఉండదని, సైద్ధాంతిక పోరాటమే ఉంటుందని తెలిపారు. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. ‘‘ప్రతిపక్షాన్ని గౌరవించాలి, మీరు (మోదీ) కూడా ఈ దిశలోనే నడుస్తారని భావిస్తున్నాను’’ అని గెహ్లాట్ అన్నారు.

నరేంద్ర మోదీ మాట్లాడుతూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రతిదానినీ తిరస్కార ధోరణితో చూసేవారికి దూరదృష్టి ఉండదన్నారు. అలాంటివారు తమ రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించలేరని చెప్పారు. నేడు (బుధవారం) తాను రూ.5,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశానని, రాజస్థాన్ ప్రజలను అభినందిస్తున్నానని చెప్పారు. రాజస్థాన్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై తన ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. గతంలో తగినన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి ఉంటే, నేడు వైద్యుల కొరత ఉండేది కాదన్నారు. ప్రతి ఇంటికీ నీటి సదుపాయం ఉండి ఉంటే, నేడు రూ.3.5 లక్షల కోట్లతో జల జీవన్ మిషన్‌ను ప్రారంభించవలసిన అవసరం ఉండేది కాదన్నారు. నకారాత్మకంగా (నెగెటివ్‌గా) ఆలోచించేవారికి దూరదృష్టి ఉండదని, వారు తమ రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించలేరని చెప్పారు.

కొందరిలో నకారాత్మకత విపరీతంగా ఉంటుందని, దేశంలో జరుగుతున్న మంచిని వారు గుర్తించలేరని అన్నారు. కేవలం వివాదాలను సృష్టించడంపైనే వారు దృష్టిపెడతారని, దానినే వారు ఇష్టపడతారని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలతోపాటు, ఆధునిక సదుపాయాలు తప్పనిసరి అని చరిత్ర చెప్తోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Karnataka Election : ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. : ప్రముఖులు

Karnataka : వంట గ్యాస్ సిలిండర్‌కు కాంగ్రెస్ నేతల పూజలు.. అన్నిటిలోనూ దేవుని చూడటం మంచిదేనన్న బీజేపీ ఎంపీ..

Updated Date - 2023-05-10T16:52:23+05:30 IST