BJP Vs DMK : సామాన్యుల సొమ్మును దోచుకుంటున్న డీఎంకే నేతలు : బీజేపీ

ABN , First Publish Date - 2023-04-21T17:38:39+05:30 IST

తమిళనాడులోని సామాన్యుల సొమ్మును డీఎంకే నేతలు దోచుకుంటున్నారని బీజేపీ (BJP) మరోసారి ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు

BJP Vs DMK : సామాన్యుల సొమ్మును దోచుకుంటున్న డీఎంకే నేతలు : బీజేపీ
MK Stallin, K Annamalai

న్యూఢిల్లీ : తమిళనాడులోని సామాన్యుల సొమ్మును డీఎంకే నేతలు దోచుకుంటున్నారని బీజేపీ (BJP) మరోసారి ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై (Tamil Nadu BJP president K Annamalai) విడుదల చేసిన డీఎంకే ఫైల్స్‌ (DMK Files)లోని ఆరోపణలను పునరుద్ఘాటించింది. ఈ సమాచారాన్ని అణ్ణామలై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ - CBI)కి పంపించారని, దర్యాప్తు జరుగుతుందని తెలిపింది.

బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ జఫర్ ఇస్లామ్ శుక్రవారం న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ, తమిళనాడు సామాన్య ప్రజల సొమ్మును డీఎంకే నేతలు దోచుకుంటున్నారని చెప్పారు. అణ్ణామలై విడుదల చేసిన డీఎంకే ఫైల్స్‌లో ఈ సమాచారం ఉందన్నారు. ఈ సమాచారాన్ని అణ్ణామలై సీబీఐకి పంపించారని, దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

అణ్ణామలై ఏప్రిల్ 14న డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 2011లో ఓ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండరును అమెరికన్ కంపెనీ ఆల్‌స్టోమ్‌కు కట్టబెట్టారని, అందుకు ప్రతిఫలంగా ఆయన ఆ కంపెనీ నుంచి రూ.200 కోట్లు ఎన్నికల నిధి రూపంలో పొందారని ఆరోపించారు. డీఎంకే అగ్ర నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్, టీఆర్ బాలు, కేఎన్ నెహ్రూ, కే పొన్ముడి, కళానిధి మారన్‌లపై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. వీరు ఆదాయానికి మించిన ఆస్తులను కలిగియున్నారన్నారు.

ఈ ఆరోపణలను డీఎంకే తోసిపుచ్చింది. ఇదంతా ఓ జోక్ అని వ్యాఖ్యానించింది. అణ్ణామలై చెప్పిన టెండర్‌లో రూ.250 కో్ట్లు ఆదా అయిందని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. అణ్ణామలైకి లీగల్ నోటీసు పంపించింది. రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు అణ్ణామలై ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. డీఎంకే యూత్ వింగ్ చీఫ్ ఉదయనిధి స్టాలిన్ కూడా బుధవారం అణ్ణామలైకి లీగల్ నోటీసు పంపించారు.

ఇవి కూడా చదవండి :

NCERT : పదో తరగతి సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ఆగ్రహం

Coca Cola Company : 35 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి అప్పగించనున్న కోకా-కోలా కంపెనీ

Updated Date - 2023-04-21T17:38:39+05:30 IST