Amit Shah : అమిత్ షా పర్యటనలో అనూహ్య మార్పులు
ABN , First Publish Date - 2023-04-01T14:53:41+05:30 IST
Amit Shah : అమిత్ షా పర్యటనలో అనూహ్య మార్పులు
పాట్నా : కేంద్ర హోం మంత్రి, బీజేపీ (BJP) సీనియర్ నేత అమిత్ షా (Amit Shah) బిహార్ పర్యటనలో మార్పులు జరిగాయి. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో సాసారామ్‌లో ఆయన పర్యటనను ఆ పార్టీ రద్దు చేసింది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 14 మంది గాయపడటంతో, నలంద, సాసారామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులను అమలు చేస్తున్నారు.
అమిత్ షా శని, ఆదివారాల్లో బిహర్‌లో పర్యటిస్తారు. అశోక చక్రవర్తి జయంత్యుత్సవాల సందర్భంగా సాసారామ్‌లో జరిగే కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొనవలసి ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, సెక్షన్ 144 అమలు నేపథ్యంలో ఆయన పర్యటనను బీజేపీ రద్దు చేసింది. నవాడాలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడతారని బిహార్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి చెప్పారు. హింసాత్మక సంఘటనలు జరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) రాష్ట్రాన్ని సక్రమంగా నడపలేకపోతున్నారన్నారు. నితీశ్ సొంత జిల్లా బిహార్‌షరీఫ్‌లో హింసాత్మక సంఘటనలను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టినట్లు కనిపిస్తోందన్నారు. తాను తప్ప వేరొకరు సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ఆయన ఓ సందేశాన్ని ఇచ్చారన్నారు. బిహార్ ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ని ఇక్కడికి పంపించవలసి ఉంటుందన్నారు.
ఇదిలావుండగా, కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, అశ్విని కుమార్ చౌబే శుక్రవారం సాసారామ్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
ఇవి కూడా చదవండి :
Jayamangala VenkataRamana: అమరావతి రైతులు ముందు నోరుజారిన వైసీపీ ఎమ్మెల్సీ..!
Hindus in danger : బీజేపీ ఆరోపణలపై మహువా మొయిత్రా మండిపాటు