Lulu Mall:లులు మాల్‌లో పాకిస్థాన్ జెండా వివాదం.. బీజేపీ నేతపై కేసు నమోదు
ABN , First Publish Date - 2023-10-14T18:42:46+05:30 IST
లులు మాల్(Lulu Mall) లో పాకిస్థాన్ జెండా(Pakistan Flag) విషయంలో తలెత్తిన వివాదంలో బీజేపీ నేతపై కేసు నమోదయింది. ఈ వివాదంలో జాబ్ కోల్పోయిన మేనేజర్ తిరిగి విధుల్లో చేరనున్నారు.
బెంగళూరు:లులు మాల్(Lulu Mall) లో పాకిస్థాన్ జెండా(Pakistan Flag) విషయంలో తలెత్తిన వివాదంలో బీజేపీ నేతపై కేసు నమోదయింది. ఈ వివాదంలో జాబ్ కోల్పోయిన మేనేజర్ తిరిగి విధుల్లో చేరనున్నారు. అసలేం జరిగిందంటే.. కేరళ(Kerala) రాష్ట్రం కొచ్చి(Kochi)లోని లులు మాల్ లో భారత్, పాకిస్థాన్ తో పాటు పలు దేశాల జెండాలు ప్రదర్శించారు. అయితే కర్ణాటక(Karnataka)కు చెందిన బీజేపీ లీడర్ శంకుతల లులు మాల్ యాజమాన్యంపై జెండాల అమరిక విషయంలో ఆరోపణలు చేశారు.
లులు మాల్ లో ఇతర దేశాల జెండాల కంటే పెద్దగా పాకిస్థాన్ జెండా పెట్టారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కాస్తా వైరల్ గా మారి లులు యాజమాన్యం దగ్గరికి వెళ్లింది. అయితే ఆ లులు మాల్ కర్ణాటకలోనిదిగా చూపిస్తూ బీజేపీ నేత ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiv Kumar) కు ట్యాగ్ చేశారు. దీంతో బెంగళూరు లులు మేనేజర్ ని కంపెనీ ఉద్యోగం నుంచి తీసేసింది. అందులో నిజమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆ లులు మాల్ కేరళాకు చెందినదిగా.. పాకిస్థాన్ జెండాను ఫోకస్ చేసి తీయడంతో ఫొటోలో పెద్దగా కనిపించిందని, మిగతావి చిన్నగా కనిపించినట్లు తేలింది.
దీంతో ఫేక్ ఫొటో షేర్ చేసినందుకు కర్ణాటక పోలీసులు బీజేపీ నేతపై కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని మాజీ మేనేజర్ అతిరా నంపియాతిరి లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తీసేశారని ఆమె వాపోయారు. కొందరి నిర్లక్ష్యపు రాతలు, పనుల వల్ల తమలాంటి వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను మళ్లీ జాయిన్ కావాల్సిందిగా లులు యాజమాన్యం కోరినట్లు అతిరా వెల్లడించారు.