Parliament sessions: కాంగ్రెస్ vs బీజేపీ.. 2012 ఘటనను గుర్తు చేసిన బీజేపీ ఎంపీ

ABN , First Publish Date - 2023-09-20T14:03:37+05:30 IST

లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మధ్య మాటల యుద్ధం నెలకొంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలను చేర్చాలని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.

Parliament sessions: కాంగ్రెస్ vs బీజేపీ.. 2012 ఘటనను గుర్తు చేసిన బీజేపీ ఎంపీ

ఢిల్లీ: లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మధ్య మాటల యుద్ధం నెలకొంది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలను చేర్చాలని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీలకు ప్రమోషనల్ కోటా బిల్లుపై లోక్‌సభలో 2012లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య జరిగిన ఘర్షణను గుర్తు చేశారు. ‘‘2012లో ఇదే సభలో వి నారాయణస్వామి ఎస్సీ, ఎస్టీల ప్రమోషనల్ కోటాపై బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన యశ్వీర్ సింగ్ ఆయన చేతిలో నుంచి బిల్లు పేపర్లను లాక్కొని చించివేశారు. ఇదే పార్లమెంట్‌లో మేడమ్ సోనియా గాంధీజీ ఆయన కాలర్ పట్టుకున్నారు’’ అని ఆయన అన్నారు. మీరు తమ నియంత కాదని, రాణి కాదని, మీరు హింసను ఆశ్రయించలేరని ఆ సమయంలో తాను సోనియాకు చెప్పినట్టు నిషికాంత్ దూబే తెలిపారు. ‘‘ఆ రోజు మీరు ఎంపీలను చంపేందుకు ప్రయత్నించారు’’ అని ఆయన ఆరోపించారు.


కాగా డిసెంబర్ 2012లో లోక్‌సభలో నారాయణస్వామి నుంచి సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు యశ్వీర్ సింగ్ 117వ రాజ్యాంగ సవరణ బిల్లు కాపీని లాక్కున్నారు. ఈ ఘటన సభలో గందరగోళానికి దారి తీసింది. ఇది ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీలకు (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు) పదోన్నతిలో రిజర్వేషన్‌ను కల్పించే బిల్లు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన ఎస్పీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాగా లోక్ సభలో జరుగుతున్న చర్చలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమల్లోకి తీసుకురావాలని లేదంటే వారికి అన్యాయం జరుగుతుందని సోనియా గాంధీ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఈ బిల్లును మొదటగా తన భర్త, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. కానీ 7 ఓట్ల తేడాతో రాజ్యసభలో వీగిపోయిందని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పీవీ నరసింహారావు హయాంలో రాజ్యసభలో ఆమోదం పొందాక 15 లక్షల మంది మహిళలకు లాభం చేకూరిందని ఆమె చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-20T14:05:44+05:30 IST