Congress : కర్ణాటక నేతలపై కన్నెర్ర!

ABN , First Publish Date - 2023-07-30T04:09:28+05:30 IST

కర్ణాటక(Karnataka )లో కాంగ్రెస్‌(Congress ) ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన విభేదాలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర జేసింది.

Congress : కర్ణాటక నేతలపై కన్నెర్ర!

2న ఢిల్లీ రావాలని సీఎం సహా కీలక నేతలకు కాంగ్రెస్‌ పిలుపు

బెంగళూరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): కర్ణాటక(Karnataka )లో కాంగ్రెస్‌(Congress ) ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన విభేదాలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర జేసింది. మరో పది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections) రానున్న తరుణంలో విభేదాలు తారస్థాయికి చేరకుండా ఆదిలోనే చక్కదిద్దేందుకు అధిష్ఠానం పెద్దలు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆగస్టు 2న సీఎం సిద్దరామయ్య(CM Siddaramaia), డీసీఎం డీకే శివకుమార్‌తోపాటు కీలక మంత్రులు, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌, ఆర్‌వీ దేశ్‌పాండే, బీఎల్‌ శంకర్‌లను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీ్‌పసింగ్‌ సుర్జేవాలా రెండురోజుల క్రితమే ఈ మేరకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు సమాచారం ఇచ్చారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీకి పిలిపించుకుని సూచనలు చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ భావించారు. కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. ఈనెలలోనే ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ సమావేశంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చిన రాహుల్‌, మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని భావించారు.


సమావేశం ముగియగానే తల్లి సోనియాగాంధీ(Sonia Gandhi)తోపాటు ఢిల్లీ వెళ్లాల్సిరావడంతో అదీ వాయిదా పడింది. ఈలోగా కలబురగి జిల్లా అలంద సీనియర్‌ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ పేరిట ఓ లేఖ హల్‌చల్‌ చేసింది. మంత్రులు తమ మాట వినడం లేదని, కనీసం నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని ఆ లేఖ ద్వారా సీఎంకు ఫిర్యాదు చేశారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఆ లేఖకు మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. లేఖ బహిర్గతం కాగానే గురువారం సీఎల్పీ భేటీ జరిగింది. అంతర్గత విషయాలను మీడియా ముందుకు ఎందుకు తీసుకెళ్తారని, సీనియర్లు బహిరంగంగా మాట్లాడితే ఎలాఅని సీఎం మందలించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే దావణగెరె జిల్లా ఎమ్మెల్యే ఒకరు తనకు ఓ మంత్రి వద్ద పీఏ లేదా ఓఎ్‌స డీ పదవి ఇప్పిస్తే పనులు చేసుకుంటానని లేఖ రాయడం మరింత కలకలం రేపిం ది. ఈ క్రమంలో అధిష్ఠానం నేతలను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. సీనియర్‌ నేతల్లో బీకే హరిప్రసాద్‌ జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్నారు. క్యాబినెట్‌లో చోటు లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు.

Updated Date - 2023-07-30T04:09:35+05:30 IST