Share News

Dense fog: మరో 5 రోజులు దట్టమైన పొగమంచు.. రైలు, విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం

ABN , Publish Date - Dec 31 , 2023 | 09:07 AM

ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు వణికిస్తోంది. ఇప్పటికే తీవ్ర చలితో విలవిలాడుతునున్న ఉత్తర భారతదేశంలో మరో 5 రోజులుపాటు దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌తో సహా చాలా చోట్ల జనవరి 4 వరకు దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

Dense fog: మరో 5 రోజులు దట్టమైన పొగమంచు.. రైలు, విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం

ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు వణికిస్తోంది. ఇప్పటికే తీవ్ర చలితో విలవిలాడుతునున్న ఉత్తర భారతదేశంలో మరో 5 రోజులుపాటు దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌తో సహా చాలా చోట్ల జనవరి 4 వరకు దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం జోర్హాట్ (అస్సాం), పఠాన్‌కోట్, బటిండా (పంజాబ్), జమ్మూ (జమ్మూ కశ్మీర్), ఆగ్రా (ఉత్తరప్రదేశ్)లలో జీరో విజిబిలిటీ నమోదైంది. అంబాలా (హర్యానా)లో 25 మీటర్ల విజిబిలిటీ.. బికనీర్ (రాజస్థాన్), పటియాల (పంజాబ్), చండీగఢ్, గ్వాలియర్ (మధ్యప్రదేశ్), ఝాన్సీ (ఉత్తరప్రదేశ్)లో 50 మీటర్ల విజిబిలిటీ.. అమృత్‌సర్ (పంజాబ్), హిసార్ (హర్యానా)లలో 200 మీటర్ల విజిబిలిటీ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మంచు ప్రభావం కారణంగా ఉత్తర భారతదేశంలోని విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ 800గా ఉంది.


డిసెంబర్ 31 (ఆదివారం) నుంచి జనవరి 4 (గురువారం) వరకు పంజాబ్‌లోని చాలా ప్రాంతాలలో సాయంత్రం నుంచి ఉదయం వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు చాలా చోట్ల దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉండే అవకాశాలున్నాయి. రాబోయే రెండు రోజులు మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే రెండు రోజులు మధ్య, వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశాలున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పులు ఉండొచ్చు. జమ్మూ-కశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో నేటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జనవరి 1-3 వరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లలో జనవరి 3 (బుధవారం) వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది

Updated Date - Dec 31 , 2023 | 09:07 AM