విజిలెన్స్ దాడులు.. భర్త అక్రమ సంపాదనను కాపాడడానికి ఈ భార్య ఏం చేసిందో చూడండి..
ABN , First Publish Date - 2023-06-24T16:10:18+05:30 IST
విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య డబ్బు కట్టలున్నఆరు సంచులను పొరుగింటి వారి టెర్రస్ మీద దాచిన ఘటన ఒడిషాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. నబరంగ్ పూర్ జిల్లాలో అదనపు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (OAS) ప్రశాంత్ కుమార్ రౌత్ ఇంటిపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు. భువనేశ్వర్, నబరంగ్‌పూర్, కానన్ విహార్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రశాంత్ కుమార్ నివాసాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
భువనేశ్వర్: విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య డబ్బు కట్టలున్నఆరు సంచులను పొరుగింటి వారి టెర్రస్ మీద దాచిన ఘటన ఒడిషాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. నబరంగ్ పూర్ జిల్లాలో అదనపు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఒడిషా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (OAS) ప్రశాంత్ కుమార్ రౌత్ ఇంటిపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు. భువనేశ్వర్, నబరంగ్‌పూర్, కానన్ విహార్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రశాంత్ కుమార్ నివాసాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏకంగా రూ.3 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు.
అయితే ప్రశాంత్ కుమార్ భార్య కానన్ విహార్‌లో ఉన్న తమ పొరుగింటివారి టెర్రస్ మీదకు డబ్బు కట్టలున్న ఆరు సంచులను విసిరి దాచమని కోరింది. కానీ అధికారులు గుర్తించి ఆ నగదు సంచులను స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్లను ఉపయోగించామని అధికారులు తెలిపారు. భర్త సంపాదించిన అక్రమ సంపాదనను కాపాడడానికి సదరు మహిళ చేసిన దాని గురించి తెలిసిన పలువురు నెటిజన్లు భర్తకు తగ్గ భార్య అని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరపు ఉత్తమ మహిళ ఈవిడే అని మరికొందరు అంటున్నారు. ఇక నబరంగ్‌పూర్‌లో ఉన్నఇంట్లో రూ.89.5 లక్షల నగదుతోపాటు బంగారు అభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా ఒడిషా రాష్ట్రంలో ఓ ప్రభుత్వ అధికారి వద్ద పెద్ద మొత్తంలో పట్టుబడిన రెండో భారీ నగదు ఇది అని విజిలెన్స్ అధికారులు తెలిపారు.. 2022 ఏప్రిల్‌లో గంజాంలోని మైనర్ ఇరిగేషన్ డివిజన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేసిన కార్తికేశ్వర్ రౌల్ నుంచి ఏకంగా రూ.3.41 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2018లో సుందర్‌గఢ్ జిల్లాలో బీడీఓగా పని చేసిన రౌల్.. లక్ష రూపాయలు తీసుకుంటూ దొరికిపోయారు.