Karnataka CM Race : వెన్నుపోటు పొడవను : డీకే శివ కుమార్

ABN , First Publish Date - 2023-05-16T10:28:24+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్కంఠభరితంగా పోరు సాగుతోంది. ఈ పోటీలో ముందు వరుసలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్ఠానం

Karnataka CM Race : వెన్నుపోటు పొడవను  : డీకే శివ కుమార్
DK Shiv Kumar

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్కంఠభరితంగా పోరు సాగుతోంది. ఈ పోటీలో ముందు వరుసలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో కలిసి, చర్చించి, గుంభనంగా వ్యవహరిస్తుండగా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ మంగళవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరారు. విమానాశ్రయానికి బయల్దేరే ముందు తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను వెన్నుపోటు పొడబోనని, బ్లాక్‌మెయిల్ చేయబోనని చెప్పారు.

కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును మంగళవారం సాయంత్రానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీకే శివ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తనను ఒంటరిగా రమ్మని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోరారని చెప్పారు. అందుకే తాను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. తన ఆరోగ్యం బాగుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంగా ఉందని చెప్పారు. తమకు 135 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్నారు. తాను పార్టీని విభజించాలని కోరుకోవడం లేదన్నారు. తనను వారు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, తాను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానన్నారు. తాను వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్‌మెయిల్ చేయబోనని తెలిపారు. ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లవలసి ఉంది. కానీ తనకు కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తూ, ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశంలో తాము ఏక వాక్య తీర్మానం చేశామని చెప్పారు. సీఎం పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయాన్ని పార్టీ హై కమాండ్‌కు వదిలిపెట్టామన్నారు. దీని తర్వాత కొందరు తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పి ఉండవచ్చునన్నారు. ఇతరుల బలం గురించి తాను మాట్లాడలేనని, తన బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలని చెప్పారు. తాను నేరుగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని శివ కుమార్ చెప్తున్నారు. శివ కుమార్ జన్మదినోత్సవాలు సోమవారం జరిగాయి. సిద్ధరామయ్యతో కలిసి కేక్ కట్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Karnataka CM Race : పెదవి కదపని సిద్ధరామయ్య

Karnataka CM Tussle : కాసేపట్లో ఢిల్లీకి డీకే శివ కుమార్

Updated Date - 2023-05-16T10:28:24+05:30 IST