Jaishankar: మీరు భారత్-అమెరికా సంబంధాలకు ఆర్కిటెక్ట్.. విదేశాంగ మంత్రి జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు
ABN , First Publish Date - 2023-10-02T12:20:30+05:30 IST
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై అమెరికా వైట్‌హౌస్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక భారత్-అమెరికా దౌత్య బంధానికి జైశంకర్ ‘‘ఆర్కిటెక్ట్’’ (రూపశిల్పి) అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొనియాడారు.
వాషింగ్టన్: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై అమెరికా వైట్‌హౌస్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక భారత్-అమెరికా దౌత్య బంధానికి జైశంకర్ ‘‘ఆర్కిటెక్ట్’’ (రూపశిల్పి) అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొనియాడారు. మంత్రి జైశంకర్ అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ఆయన గౌరవార్థం అక్కడి భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని ప్రముఖ వ్యక్తులు, యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రిచర్డ్ వర్మ, ప్రెసిడెంట్ బైడెన్ దేశీయ విధాన సలహాదారు నీరా టాండెన్, నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ వైట్ హౌస్ ఆఫీస్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ గుప్తా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. సేతురామన్ పంచనాథన్ పాల్గొన్నారు.
ఈ క్రమంలో సీనియర్ దౌత్యవేత్త రిచర్డ్ వర్మ మాట్లాడుతూ అమెరికా-భారత్ బంధం బలోపేతానికి ఎన్నారైలు ఎంతో కృషి చేశారని అన్నారు. జైశంకర్ ఆధునిక యుఎస్-ఇండియా సంబంధాల వెనుక ఉన్న ఆర్కిటెక్ట్ అని ప్రశంసించారు. ఆయన పర్యవేక్షణలో యుఎస్-ఇండియా వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడ్డాయని కొనియాడారు. "ఇది ఈ శతాబ్దపు అత్యంత పర్యవసానమైన సంబంధాలలో ఒకటి. ఇది మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ల గొప్ప ఆలోచనలతో కూడిన భాగస్వామ్యం. ఇది నిజమైన ప్రభావంతో శక్తితో కూడిన భాగస్వామ్యం. ఈ బంధం కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య బంధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. నాకు జైశంకర్ చాలా కాలంగా అనేక సామర్థ్యాలలో తెలుసు. నేను కూడా చెప్పగలను. ఆయన ఆధునిక యూఎస్-భారత్ సంబంధాల రూపశిల్పి. జైశంకర్ హయాంలో దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. జైశంకర్ కృషి, నాయకత్వం వల్లే ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాం’’ అని వర్మ పేర్కొన్నారు.
బైడెన్ అత్యున్నత సలహాదారు, వైట్‌హౌస్‌లోని ప్రముఖ భారతీయ అమెరికన్ నీరా టాండన్ మాట్లాడుతూ.. భారతదేశం, యుఎస్ మధ్య వ్యక్తి నుంచి వ్యక్తికి, సంఘం నుంచి కమ్యూనిటీ నాయకత్వానికి బలమైన సంబంధాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అని అన్నారు. భారతీయ అమెరికన్లు పరిపాలనలో అంతటా ప్రముఖ స్థానాల్లో ఉన్నారని ఆయన చెప్పారు. "వాస్తవానికి, మీరు వైట్ హౌస్‌పై రాయి విసిరలేరు. ఈ రోజుల్లో భారతీయ అమెరికన్లను కొట్టలేరు" అని నీరా టాండన్ చెప్పారు. యుఎస్‌లోని భారత రాయబారి శ్రీ సంధు గురించి నీరా టాండన్ మాట్లాడుతూ "భారత్‌కు ఇప్పటివరకు ఉన్న బలమైన రాయబారులలో ఆయన ఒకరు" అని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో అమెరికాలోని ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ ఎన్నారైలపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా గాంధీ జయంతి సందర్భంగా యుఎస్‌లో మహాత్మా గాంధీ చిత్రపటానికి జైశంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఇతర అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా అమెరికాలో జైశంకర్ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30 వరకు పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జీఏ) 78వ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో జైశంకర్ వాషింగ్టన్‌లో పలువురు అమెరికా ప్రభుత్వ అధికారులను కలిశారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రాయబారి కేథరీన్ తాయ్, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్‌లతో సహా పలువురు యూఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.